బరువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇబ్బందే. సరైన బరువుని మెయింటైన్ చేయాలి. వయసుకు తగ్గట్టుగా బరువు ఉంటే ఇబ్బంది ఉండదు. శరీర బరువు పెరగడం వలన కొలెస్ట్రాల్, షుగర్, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. జీవనశైలి, శరీర కూర్పు, రోజు వారి కార్యకలాపాలు శరీర బరువుని నిర్ణయిస్తాయట. బాడీ మాస్ ఇండెక్స్ కనుగొనేందుకు ఆన్లైన్ బీఎంఐ క్యాలిక్యులేటర్ లో మీ ఎత్తు, మీ బరువు, మీ వయసు నమోదు చేసి బరువు గురించి తెలుసుకోవచ్చు. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్.
మీ బరువు మీ ఎత్తుకు సరిపోయిందో లేదో చెప్తుంది. ఎత్తును మీటర్లలో నమోదు చేయండి. దానిని 100 సెంటీమీటర్లతో విభజించండి. బీఎంఐ సరిగ్గా లేకపోతే మధుమేహం, పక్షవాతం, అధిక రక్తపోటు ఇలా అనేక సమస్యలు వస్తాయి. బీఎంఐ కాలిక్యులేటర్ సహాయంతో ఎత్తును బట్టి బరువుని లెక్కిస్తాము. దీన్ని బట్టి బరువు తక్కువ ఉన్నారా లేదంటే అధిక బరువు ఉన్నారా అనేది తెలుసుకోవచ్చు.
4 అడుగుల 10 అంగుళాలు ఉంటె 41 నుండి 52 కిలోల బరువు, ఎత్తు 5 అడుగులు అయితే బరువు 44 నుండి 55.7 కిలోలు, 5 అడుగుల 2 అంగుళాలు వారు 49 నుండి 63 కిలోల బరువు, 5 అడుగుల 4 అంగుళాలు వారు 49 నుండి 63 కిలోల మధ్య ఉండాలి. 5 అడుగుల 6 అంగుళాలు వారు 53 నుండి 67 కిలోలు, 5 అడుగుల 8 అంగుళాలు వారు 56 నుండి 71 కిలోలు, 5 అడుగుల 10 అంగుళాలు వారు 59 నుండి 75 కిలోలు, 6 అడుగులు వారు 63 నుంచి 80 కిలోలు ఉండాలి. 19-29 సంవత్సరాల వయస్సు పురుషుడు 83.4 బరువు ఉండాలి. స్త్రీ 73.4 ఉండాలి. 30-39 సంవత్సరాల పురుషుడు 90.3 కిలోలు, స్త్రీ 76.7 కిలోలు ఉండాలి. 40-49 సంవత్సరాలు పురుషుడు 90.9 కిలోలు, స్త్రీ 76.2 కిలోలు ఉండాలి. 50-60 సంవత్సరాలు పురుషుడు 91.3 కిలోలు, స్త్రీ 77.0 కిలోల వరకు ఉండాలి.