Bananas : అరటి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాటితో మనకు పలు కీలక పోషకాలు అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే అరటి పండు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ అందరూ దాన్ని తినకూడదు. కేవలం కొంత మంది మాత్రమే తినాలి. ముఖ్యంగా కింద చెప్పిన అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లను తినకూడదు. దాన్ని ఆహారం నుంచి తొలగించాలి. మరి ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండును తినకూడదో ఇప్పుడు తెలుసుకుందామా.
అధిక బరువు ఉన్న వారు, స్థూలకాయులు అరటి పండ్లను తినకూడదు. తింటే అందులో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. కనుక అధిక బరువు ఉన్నవారు అరటి పండ్లను తినరాదు. హైపర్‌కలేమియా వ్యాధి ఉన్నవారు కూడా అరటి పండ్లను తినరాదు. తింటే గుండె సంబంధ సమస్యలు వస్తాయి. బీపీ పెరుగుతుంది. ఎల్లప్పుడూ టెన్షన్, ఆందోళనతో ఉంటారు. అరటి పండ్లలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్నవారికి మంచిది కాదు. దీని వల్ల తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. అది నాడుల డ్యామేజ్‌కు దారి తీస్తుంది.
మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. మళ్లీ ఆ స్థాయిలు తగ్గాలంటే అందుకు లివర్, మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. లేదంటే చక్కెర స్థాయిలు పెరిగి తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలర్జీ సమస్య ఉన్నవారు అరటిపండ్లను తినరాదు. తింటే ముఖం, ఇతర శరీర భాగాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. దురద కూడా ఉంటుంది. కనుక అలాంటి వారు అరటిపండ్లను మానేయాలి.
మూత్రపిండాలు, మూత్రాశయ సమస్యలతో బాధపడుతున్నవారు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. ఎందుకంటే అరటిపండ్లలో ఉండే పొటాషియం కిడ్నీలపై భారం పెంచుతుంది. దీంతో కిడ్నీలు త్వరగా పాడైపోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ సమస్యలు ఉన్నవారు కూడా అరటి పండ్లను తినరాదు. ఇక ఇతరులు ఎవరైనా సరే అరటిపండ్లను తినవచ్చు. కానీ రోజుకు 1 లేదా 2 వరకు మాత్రమే తినాలి. అధికంగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి అరటి పండ్లను మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.