Strawberries Health Benefits : స్ట్రాబెర్రీల‌ను రోజూ తింటే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Strawberries Health Benefits : స్ట్రాబెర్రీస్.. చిన్న‌గా, ఎర్ర‌గా ఉండే ఈ పండ్లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. స్ట్రాబెర్రీలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇత‌ర పండ్ల వ‌లె స్ట్రాబెర్రీలు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీస్ లో ఉండే పోష‌కాలు అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండ్ల‌ల్లో విట‌మిన్ సి, క్యాల్షియం, ఐర‌న్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫైబ‌ర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క‌ణాల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ కార‌ణంగా శ‌రీరానికి హానిని క‌లిగించ‌కుండా కాపాడ‌డంలో సహాయ‌ప‌డ‌తాయి. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్, గుండె స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే స్ట్రాబెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్పెక్ష‌న్ లు, వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. స్ట్రాబెర్రీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిలో ఉండే పొటాషియం అధిక ర‌క్తపోటును అదుపులో ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

Strawberries Health Benefits must take them daily for many uses
Strawberries Health Benefits

అంతేకాకుండా స్ట్రాబెర్రీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అలాగే స్ట్రాబెర్రీ పండ్ల‌ల్లో ఫోలేట్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భిణీ స్త్రీల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. స్ట్రాబెర్రీ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఈ విధంగా స్ట్రాబెర్రీ పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts