Pumpkin Seeds : ఈ సమస్యలు ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాలను తినరాదు..!

Pumpkin Seeds : గుమ్మడి కాయ విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి. అలాగే శక్తిని ఇస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల గుమ్మడికాయ విత్తనాలను తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినరాదు. మరి ఏయే సమస్యలు ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాలను తినరాదో ఇప్పుడు తెలుసుకుందామా..!

if you have these problems you should not eat Pumpkin Seeds

1. గుమ్మడికాయ విత్తనాలను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ల సూచన మేర తీసుకోవాలి. కొందరికి ఇవి సమస్యలను కలగజేస్తాయి. కనుక వారు ఈ విత్తనాలను తినే ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

2. డయాబెటిస్‌ ఉన్నవారిలో అయితే ఈ విత్తనాలు షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించేందుకు సహాయ పడతాయి. అయితే తక్కువ షుగర్‌ లెవల్స్‌ అంటే.. లో షుగర్‌ ఉన్నవారు ఈ విత్తనాలను తింటే మరింత షుగర్‌ లెవల్స్‌ పడిపోతాయి. దీంతో అపాయం కలుగుతుంది. కనుక షుగర్‌ తక్కువగా ఉండేవారు వీటిని తినరాదు.

3. గుమ్మడికాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. అయితే లో బీపీ సమస్య ఉన్నవారు ఈ విత్తనాలను తింటే బీపీ ఇంకా తగ్గుతుంది, సమస్యలు వస్తాయి. కనుక లో బీపీ ఉన్నవారు కూడా ఈ విత్తనాలను తినరాదు.

4. గుమ్మడికాయ విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. అయితే ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తినరాదు. తింటే ఫైబర్‌ జీర్ణ సమస్యలను కలగజేస్తుంది. కనుక వీటిని తక్కువగా తినాలి.

Editor

Recent Posts