BP : హైబీపీ ఉందా ? అయితే ఈ సూచనలను రోజూ పాటించండి.. బీపీ కచ్చితంగా అదుపులోకి వస్తుంది..!

BP : ఈ రోజుల్లో అధిక రక్తపోటు చాలా సాధారణంగా మారింది. ఇది సాధారణంగా 35 నుండి 40 సంవత్సరాల వయస్సు తర్వాత సంభవిస్తుంది. అధిక రక్తపోటుకు కారణాలు.. ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి అని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని రవాణా చేయడానికి గుండె పనిచేస్తుంది. దీని కోసం సిరల్లో సరైన ఒత్తిడి అవసరం.

if you have BP then follow these tips definitely work

ఈ ఒత్తిడి పెరిగితే అధిక రక్తపోటు సంభవిస్తుంది. ఒత్తిడి తగ్గితే తక్కువ రక్తపోటు కలుగుతుంది. అయితే సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మీ శరీరంలో సోడియం మొత్తం పెరుగుతుంది. దీని కారణంగా అధిక బీపీ, స్ట్రోక్‌తో సహా ఇతర తీవ్రమైన గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. మీకు అధిక బీపీ సమస్య ఉంటే.. మీరు ఆహారంలో ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఇదే కాకుండా ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా తాజా పండ్లను తీసుకోవాలి.

2. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే.. కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఇది మీ రక్తపోటును పెంచుతుంది. మనలో చాలా మంది ఆఫీసులో పనిచేసేటప్పుడు కాఫీ, టీ తాగుతారు. ఇది శరీరంలో చురుకుదనాన్ని తెస్తుంది. కాఫీ తాగిన తర్వాత శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల కాఫీ తాగడం ప్రయోజనకరం. కానీ మోతాదుకు మించి తాగితే బీపీ పెరుగుతుంది. కనుక టీ, కాఫీలను మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.

3. గుమ్మడి గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. అధ్యయనాల ప్రకారం.. వీటిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. మీకు తక్కువ లేదా ఎక్కువ బీపీ ఏది ఉన్నా సరే.. గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చుకుంటే.. కచ్చితంగా సమస్య తగ్గుతుంది.

4. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వలన అధిక బీపీని నియంత్రించవచ్చు. ఇది గుండెకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి రోజుకు 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇదే కాకుండా ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడి తీవ్రమైన గుండె జబ్బులకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. దీంతో బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.

Share
Admin

Recent Posts