Pumpkin Seeds : ప్ర‌పంచ మేధావులు తినే ఆహారం ఇదే.. దీన్ని తింటే మెద‌డు అద్భుతంగా ప‌నిచేస్తుంది..!

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిలో తీపి గుమ్మ‌డికాయ‌లు, బూడిద గుమ్మ‌డి కాయ‌లు అని రెండు ర‌కాలు ఉంటాయి. బూడిద గుమ్మ‌డి కాయ‌ల‌తో వ‌డియాలు పెట్టుకోవ‌డంతో పాటు దిష్టి త‌గ‌ల‌కుండా ఇళ్ల‌కు క‌ట్టుకుంటూ ఉంటారు. అలాగే తీపి గుమ్మ‌డిని దైవ కార్యాల్లో వాడ‌డంతో పాటు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. గుమ్మ‌డిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో 92 శాతం నీరు ఉంటుంది. అలాగే 100 గ్రాముల గుమ్మ‌డికాయ‌లో 25 క్యాల‌రీల శ‌క్తి మాత్ర‌మే ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. ఇది సుల‌భంగా జీర్ణ‌మ‌వుతుంది. మ‌న ఆరోగ్యానికి మేలు చేసిన‌ప్ప‌టికి గుమ్మ‌డికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వాతం చేస్తుంద‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు.

అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మంపైదుర‌దలు, దద్ద‌ర్లు కూడా వ‌స్తాయ‌ని అనుకుంటూ ఉంటారు. అయితే గుమ్మ‌డికాయ‌లో వాతం చేచ‌సే గుణం లేద‌ని దానిని వండే విధానం వ‌ల్ల గుమ్మ‌డికాయ వాతం చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. గుమ్మ‌డికాయ‌తో ఎక్కువ‌గా పులుసును త‌యారు చేస్తూ ఉంటారు. పులుసు కూర‌లు వండ‌డానికి చింత‌పండును ఉప‌యోగిస్తారు. చింత‌పండు వేసిన కార‌ణంగా వంట‌ల్లో కారం, ఉప్పు, మ‌సాలాలు ఎక్కువ‌గా వేయాల్సి వ‌స్తుంది. ఉప్పుకు వాతం చేసే గుణం ఉంద‌ని దీని కారణంగా గుమ్మ‌డికాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు వాతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పుకు అల‌ర్జీ చేసే గుణం కూడా ఉంది.

Pumpkin Seeds intelligent people food take daily
Pumpkin Seeds

గుమ్మ‌డికాయ కూర‌లో వేసే ఉప్పు వాతం చేస్తుంద‌ని కానీ గుమ్మ‌డికాయ వాతం చేయ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. చింత‌పండు, ఉప్పు వేయ‌కుండా చేసే గుమ్మ‌డికాయ వంట‌కాల‌ను తిన‌డం వల్ల ఎటువంటి వాతం చేయ‌ద‌ని వారు సూచిస్తున్నారు. చింత‌పండుకు బ‌దులుగా ప‌చ్చి చింత‌కాయ‌లు, ప‌చ్చి మామిడికాయ‌లు, ట‌మాట ర‌సం వేసి గుమ్మ‌డికాయ పులుసును చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి వాతం చేయ‌ద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. గుమ్మ‌డి కాయ‌తో పాటు గుమ్మ‌డి గింజ‌లు కూడా మ‌న ఆరోగ్యానికిఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. గుమ్మ‌డిగింజ‌లు దాదాపు జీడిప‌ప్పుతో స‌మానంగా ఉంటాయ‌ని వారు చెబుతున్నారు. గుమ్మ‌డి గింజ‌ల్లో ఉండే ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల జింక్ అత్య‌ధికంగా ఉంటుంది.

ఈ గుమ్మ‌డి గింజ‌ల ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. తెలివితేట‌లు, జ్ఞాప‌క శ‌క్తి పెర‌గ‌డంతో పాటు వృద్దాప్యంలో మ‌తిమ‌రుపు, అల్జీమ‌ర్స్ వంటి స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. ఈ ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ఆలోచ‌నా శ‌క్తి పెర‌గడంతో పాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా గుమ్మ‌డి కాయ‌తో పాటు గుమ్మ‌డి గింజ‌ల ప‌ప్పు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts