Sunflower Seeds : ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాలను నిత్యం తీసుకోవడం అవసరం . అలాంటి ఆహారాలు మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఓ వైపు పోషకాలను అందించడంతోపాటు శరీరానికి అవి శక్తిని ఇస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. అలాంటి పోషకాలు ఉన్న ఆహారాల్లో పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా ఒకటి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో బాగా సహాయ పడతాయి. ఇప్పుడు పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శరీరానికి కావల్సిన కీలక పోషకాలను అందించడంతో పాటు.. శరీరంలో ఉన్న అధిక కొవ్వుని కరిగిస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాలు తినడం కారణంగా కీళ్లనొప్పులు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది. డయాబెటిస్ ను అదుపు చేసే గుణం పొద్దు తిరుగుడు విత్తనాలకు ఉంటుందని అనేక పరిశోధనల్లో వెళ్లడయ్యింది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా వీటి విత్తనాలు కాపాడతాయి. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడంతో పాటు మన శరీరంలోని రక్త సరఫరాని మెరుగు పరచడంలో పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు మేలు చేస్తాయి. వీటిలో మాంగనీస్ పుష్కలంగా ఉండటం వలన ఎముకలను దృఢముగా ఉంచుతాయి.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. తరచూ పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
హార్మోన్ల సమస్యలు ఉన్నవారు పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు అసమతుల్యత ఉండదు. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా పనిచేస్తుంది. గర్భంతో ఉన్న మహిళలు పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. గర్భస్థ శిశువు ఎదుగుదలకు కావలసిన అనేక పోషకాలు పొద్దు తిరుగుడు విత్తనాల ద్వారా లభిస్తాయి.