Proteins : మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. చురుకుగా, బలంగా, ఉత్సాహంగా, చలాకీగా, కండరాలు ధృడంగా ఉండాలంటే మన శరీరానికి ప్రోటీన్లు ఎంతో అవసరం. అలాగే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్న కూడా మన శరీరానికి ప్రోటీన్లు అవసరం. ప్రోటీన్లు కలిగిన ఆహారాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి కోడిగుడ్లు మరియు మాంసం. చాలా మంది ఈ ఆహారాల్లో మాత్రమే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. ఒక కోడిగుడ్డులో 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చాలా ప్రోటీన్ కోసం కోడిగుడ్లపైనే ఆధారపడుతూ ఉంటారు.
కోడిగుడ్లు అలాగే మాంసం కంటే 10 రెట్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో రాజ్మా ఒకటి. అర కప్పు రాజ్మాలో 9 గ్రాములు ప్రోటీన్లు ఉంటాయి. అలాగే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా కూడా మనం శరీరానికి తగినంత ప్రోటీన్ ను అందించవచ్చు. అదే విధంగా కెఫిర్ ను తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. ఈ కప్పు కెఫిర్ లో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది పాల నుండి తయారు చేసే ఒక పదార్థం. ఇది చూడడానికి క్రీమ్ లా ఉంటుంది. దీనిలో ప్రోబయాటిక్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ కెఫిర్ ను పాలు, పెరుగు రెండు కలిపి చేస్తారు.
దీనిని వివిధ రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తారు. రోజూ ఒక కప్పు కెఫిర్ ను తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్, ప్రొబయాటిక్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఇతర ఆహారాల్లో గుమ్మడి విత్తనాలు ఒకటి. పావు కప్పు గుమ్మడి విత్తనాల్లో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా మనం శరీరానికి తగినంత ప్రోటీన్లను, ఐరన్ ను అందించిన వాళ్లం అవుతాము. ఈ గుమ్మడి విత్తనాలను ఏ రూపంలో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అదే విధంగా పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి ద్రవరూపంలో ఉంటాయి కనుక వీటిని తీసుకోవడం చాలా సులభం. అలాగే పాలల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, క్యాల్షియం, విటమిన్ డి కూడా ఉంటుంది. అలాగే పప్పు ధాన్యాల్లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు పప్పు దినుసుల్లో 18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.
పప్పు ధాన్యాలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మనప శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే పీనట్ బటర్ లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ లో 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అలాగే ఇది రుచిగా కూడా ఉంటుంది. ప్రోటీన్లను తీసుకోవాలనుకునే వారు రోజూ 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ ను తీసుకుంటే చాలు. అలాగే పన్నీర్, డ్రై ఫ్రూట్స్, క్యాబేజ్, బచ్చలికూర, పుట్టగొడుగులు, అవకాడొ వంటి వాటిని తీసుకున్నా కూడా శరీరానికి తగినంత ప్రోటీన్లు లభిస్తాయి. మాంసాహారం తినని వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినన్ని ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలను కూడా అందిచవచ్చు.