Bachali Kura: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. దీన్ని తిన‌డం మ‌రిచిపోకండి..!

Bachali Kura: మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి. చాలా మంది దీన్ని తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ బ‌చ్చ‌లికూర పోష‌కాల‌కు నిల‌యం. అనేక ఔష‌ధ గుణాలు ఇందులో ఉంటాయి. బ‌చ్చ‌లికూర‌ను నేరుగా కూర‌గా వండుకుని తిన‌వ‌చ్చు. లేదా ప‌ప్పులా చేసి తిన‌వ‌చ్చు. దీని ఆకుల ర‌సాన్ని ప‌ర‌గ‌డుపున 30 ఎంఎల్ మోతాదులోనూ తాగ‌వ‌చ్చు. బ‌చ్చ‌లికూర వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

bachali kura prayojanalu

* బ‌చ్చ‌లికూర‌లో విట‌మిన్లు ఎ, సి, ఇ, బి విట‌మిన్లు, ఐర‌న్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, అయోడిన్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్లు ఉంటాయి. అందువల్ల ఈ కూర‌ను తింటే పోష‌ణ ల‌భిస్తుంది. ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

* బ‌చ్చ‌లికూర‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని తింటే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ కూర‌లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చ‌ర్మం, వెంట్రుక‌ల‌ను సంర‌క్షిస్తుంది.

* రోజూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంద‌ని భావించే వారు బ‌చ్చ‌లికూర‌ను తింటే శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా మారుతారు.

* హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు బ‌చ్చ‌లికూర‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. గ‌ర్భిణీలు దీన్ని తింటే ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది.

* బ‌చ్చ‌లికూర‌లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు ప‌డుతుంది. పైల్స్ స‌మ‌స్య ఉన్న‌వారు బ‌చ్చ‌లికూర‌ను తింటుంటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

* బ‌చ్చ‌లికూర‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అధిక బ‌రువు, కొలెస్ట్రాల్, మ‌ధుమేహం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రోజూ ప‌ర‌గ‌డుపున బ‌చ్చలి ఆకుల ర‌సం తాగితే ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

* బ‌చ్చ‌లికూర‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. ఈ కూర‌లో ఉండే విట‌మిన్ కె ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది.

* బ‌చ్చలికూర‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే నాడీ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Admin

Recent Posts