చిక్కుళ్లు సోయా, బీన్స్ జాతికి చెందుతాయి. మనకు అందుబాటులో ఉండే కూరగాయల్లో చిక్కుళ్లు కూడా ఒకటి. కొందరు వీటిని ఇండ్లలోనే పెంచుతారు. చిక్కుడు కాయలతో పలు రకాల కూరలను చేసుకుని తింటుంటారు. అయితే చిక్కుడు కాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చిక్కుడు కాయలను తరచూ తినడం వల్ల గుండెకు ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిల్లో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. చిక్కుడు కాయల్లో విటమిన్ బి1 అధికంగా ఉంటుంది. ఇది హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. చిక్కుడు కాయల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతగానో అవసరం. అందువల్ల వీటిని వారు రోజూ తీసుకోవాలి. దీంతో శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
2. చిక్కుడు కాయలను తరచూ తినడం వల్ల పార్కిన్‌సన్ డిసీజ్ రాకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
3. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారు చిక్కుడు కాయలను రోజూ ఆహారంలో తీసుకుంటే మంచిది. చిక్కుడు కాయల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువున నియంత్రణలో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
4. చిక్కుడు కాయల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది హైబీపిని తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపు చేస్తుంది. ఈ సమస్యలు ఉన్నవారు చిక్కుడు కాయలను తరచూ తినాలి. దీంతోపాటు కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
5. మలబద్దకం సమస్యతో బాధపడేవారు చిక్కుడు కాయలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ కాయల్లోని ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ రాకుండా చూస్తుంది.
6. చిక్కుడు కాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు బి, సి, కె, మాంగనీస్, మెగ్నిషియం, జింక్ ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365