Sweet Potato : చిలగడ దుంప.. ఇది మనందరికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైన దుంప. చిలగడ దుంప మనకు వివిధ రంగుల్లో లభిస్తూ ఉంటుంది. చిలగడ దుంపను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ దుంపలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. చిలగడ దుంప తియ్యగా ఉన్నప్పటికి దీనిని తినడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ తో బాధపడే వారికి చిలగడ దుంప ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. చిలగడ దుంపకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే శక్తి ఉంది. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. చిలగడ దుంపలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలతో బాధపడే వారు చిలగడ దుంపను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
చిలగడ దుంపను తీసుకోవడం వల్ల గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, చర్మం పై ఉండే ముడతలను తొలగించడంలో, చర్మ కాంతిని మెరుగుపరచడంలో కూడా చిలగడ దుంప మనకు దోహదపడుతుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడే వారు చిలగడ దుంపలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
జుట్టు బాగా పెరగడంలో కూడా చిలగడ దుంప తోడ్పడుతుంది. అంతేకాకుండా చిలగడదుంపలను తినడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. రక్తహీనత సమస్య కూడా దూరం అవుతుంది. ఈ దుంపలు మనకు ఎల్లవేళలా దొరకవు. ఇవి లభ్యమయినప్పుడు మాత్రం వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.