క్లోరోఫిల్‌ అంటే ఏమిటి ? దాని వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు

మొక్కలు ఆకుపచ్చగా, ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు క్లోరోఫిల్‌ ఉపయోగపడుతుంది. ఇదొక వర్ణద్రవ్యం. దీని వల్లే మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇక మొక్కలకు సంబంధించి కిరణ జన్య సంయోగ క్రియలోనూ క్లోరోఫిల్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే క్లోరోఫిల్‌ మొక్కలకే కాదు, మనకు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. క్లోరోఫిల్‌కు సంబంధించి క్లోరోఫిలిన్‌ పేరిట సప్లిమెంట్లను విక్రయిస్తున్నారు. వాటిని డాక్టర్‌ సూచన మేరకు వాడుకోవచ్చు. లేదా ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకు క్లోరోఫిల్‌ లభిస్తుంది. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

what is chlorophyll and health benefits of chlorophyll

1. క్లోరోఫిల్‌ను తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి. గాయాలు త్వరగా మానుతాయి. 2008లో పలువురు సైంటిస్టులు పరిశోధనలు చేసి మరీ ఈ విషయాలను వెల్లడించారు. 8 వారాల పాటు కొందరికి రోజూ క్లోరోఫిలిన్‌ ఇవ్వడం వల్ల సూర్యకాంతి వల్ల కందిపోయిన చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందిందని నిర్దారించారు. అందువల్ల క్లోరోఫిల్‌ చర్మ సమస్యలను తగ్గిస్తుంది.

2. రక్తహీనత సమస్య ఉన్నవారు క్లోరోఫిల్‌ను రోజూ తీసుకోవాలి. దీని వల్ల రక్తం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా గోధుమగడ్డిని కొన్ని వారాల పాటు రోజూ తీసుకోవడం వల్ల రక్తం బాగా పెరిగిందని సైంటిస్టులు గుర్తించారు. కనుక రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ క్లోరోఫిల్‌ అందేలా చూసుకోవాలి.

3. క్లోరోఫిల్‌ ఉన్న పదార్థాలను రోజూ తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. క్యాన్సర్‌ కణాలు నశిస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదల ఆగిపోతుంది. ముఖ్యంగా పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ రాకుండా ఉంటుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.

4. క్లోరోఫిల్‌ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు. 2014లో కొందరు సైంటిస్టులు కొన్ని రోజుల పాటు కొందరికి క్లోరోఫిల్‌ సప్లిమెంట్లు ఇచ్చారు. తరువాత వారిలో బరువు తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల క్లోరోఫిల్‌ బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

5. చెమట వల్ల కొందరికి శరీరం దుర్వాసన వస్తుంది. అలాంటి వారు క్లోరోఫిల్‌ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

క్లోరోఫిల్‌ వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినా అతిగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. విరేచనాలు, కడుపులో మంట, నొప్పి, జీర్ణ సమస్యలు, ఒళ్లంతా దురదలు రావచ్చు. కనుక ఆ ఆహారాలను లేదా సప్లిమెంట్లను మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి రోజుకు 100 నుంచి 300 మిల్లీగ్రాముల మోతాదులో క్లోరోఫిలిన్‌ సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అవసరం అంటే డోసును విభజించి రెండు పూటలా వేసుకోవచ్చు. కానీ మోతాదుకు మించరాదు. అలాగే పాలకూర, కొత్తిమీర, తోటకూర, ఇతర ఆకు పచ్చని కూరగాయలు, పండ్లను తీసుకున్నా క్లోరోఫిల్‌ అందుతుంది. గోధుమగడ్డి, గ్రీన్‌ బీన్స్‌, పచ్చిబఠానీలు వంటివి కూడా తీసుకోవచ్చు. కూరగాయలు, పండ్ల ద్వారా అయితే రోజుకు 24 మిల్లీగ్రాముల మోతాదులో క్లోరోఫిల్‌ అందేలా చూసుకోవాలి. అంటే పండ్లు లేదా ఆకుకూరలను ఒక కప్పు మోతాదులో తీసుకోవాలన్నమాట.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts