Dry Grapes : ఎండు ద్రాక్ష.. వీటినే కిస్మిస్‌లు అని కూడా అంటారు. వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిస్మిస్‌లలో ఉండే పోషకాలు నోట్లో ఉండే బాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కిస్మిస్‌లలో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.
కిస్మిస్‌లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జ్వరం వచ్చిన వారు కిస్మిస్‌లను తింటే త్వరగా కోలుకుంటారు. శక్తి బాగా లభిస్తుంది. ఉత్సాహం వస్తుంది. నీరసం తగ్గుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
కఫం బాగా ఉన్నవారు కిస్మిస్‌లను తింటే ఉపశమనం లభిస్తుంది. దగ్గు తగ్గుతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.