Off Beat

ఈ భార్యాభర్తలకు కూడా రేపు అదే గతి పడుతుంది!

రజిత, వినోద్ లు భార్యభర్తలు ఓ ఫంక్షన్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అయిదేళ్ల కొడుకును కూడా రెడీ చేస్తున్నారు. ఆ ఇంట్లో వినోద్ వాళ్లమ్మ కూడా ఉంది. అత్తమ్మా ప్లేటూ, గ్లాస్ రెడీ పెట్టుకోండి అంటూ కోడలు అత్తతో చెప్పింది. కార్ లో బయలుదేరుతూ వినోద్ వాళ్లమ్మను సాయిబాబా గుడి దగ్గర దించి, ఇక్కడ ఈ రోజు అన్నదానం చేస్తారు అన్నం తిని , ఇక్కడే కూర్చో, సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు నిన్ను తీసుకెళ్తాం అన్నాడు.

వినోద్ వాళ్లమ్మను అక్కడ దించి, కార్ ను ముందుకు పోనిస్తున్నాడు. ఇంతలో రజిత ఒళ్ళో ఉన్న అయిదేళ్ళ అభినవ్ మమ్మీ, డాడీ.. నేను పెద్దయ్యాక దేవుడి గుడి పక్కనే పెద్ద ఇల్లు కడతా అంటాడు. కుర్రాడి ఆ మాటలకు… భార్యభర్తలిద్దరూ ఉబ్బితబ్బిబై రెండు బుగ్గలపై చెరో ముద్దిస్తారు. అరేయ్ నాన్న అక్కడే ఎందుకు రా అంటుంది రజిత అభినవ్ తో… అప్పుడు అభినవ్. అదేం లేదు మమ్మీ…. గుడికి దూరంగా ఇల్లుంటే …. మనలాగా అప్పుడు నేను కూడా ఫంక్షన్ కు వెళితే ముసలివాళ్లైన మిమ్మల్ని ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం ఉండదు కదా.. ఏం చక్కా మీరే ప్లేటూ , గ్లాసూ పట్టుకొని నడుచుకుంటూ వెళ్లొచ్చు గుడిలోకి అంటాడు.

a boy taught lesson to his parents with his words

కొడుకు మాటలకు సిగ్గు తెచ్చుకున్న ఆ భార్యభర్తలు కార్ ను వెనక్కి రానిచ్చి గుడిమెట్ల మీదున్న వాళ్ల అమ్మను తమతో పాటు ఫంక్షన్ కు తీసుకెళతాడు వినోద్.

Admin

Recent Posts