కాలికున్న పాత చెప్పులు తెగిపోవడంతో …. వాటిని అక్కడే వదిలేసి, కొత్త చెప్పులు కొందామని షాపింగ్ మాల్ లోకి వెళ్ళాను. షూస్, శాండిల్స్, చప్పల్స్…ఫోర్త్ ఫ్లోర్ లో ఉండడంతో లిఫ్ట్ ఎక్కాను.ఫస్ట్ ఫ్లోర్ లో స్టార్ట్ అయిన లిఫ్ట్ సెకెండ్ ఫ్లోర్ కి వెళ్లింది. అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఆ లిఫ్ట్ లోకి ఎక్కారు. అక్కడి నుండి లిఫ్ట్ ఫోర్త్ ఫ్లోర్ కి మూవ్ అవుతున్న సమయంలో..లిఫ్ట్ ధడేల్ మని ఆగిపోయింది.!! లిఫ్ట్ లో ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయిపోయాయి.! లిఫ్ట్ షేక్ అయ్యే సరికి అప్పటికే ఆ బుర్ఖా అమ్మాయి కొన్న గాజు ఐటమ్స్ కింద పడడం, పగిలిపోవడం, నేను వాటి మీద కాలు పెట్టడం,అవి నా కాలుకి గుచ్చుకొని రక్తం కారడం జరిగిపోయాయి.!!
లిఫ్ట్ ఫోర్త్ ఫ్లోర్ లో ఆగిపోయింది.! నా కాలుకు రక్తం కారుతుంది. అంతలో ఓ బుర్ఖా అమ్మాయి..రక్తం కారుతున్న నా కాలును చూసి…తన నఖాబ్ (ముఖానికి అడ్డుగా ఉన్న పరదా) ను తీసి రక్తం కారుతున్న కాలుకు కట్టింది.! ఈ క్రమంలో ఆ అమ్మాయి పక్కనే ఉన్న మరో బుర్ఖా అమ్మాయి… నఖాబ్( ముఖానికి అడ్డుగా ఉన్న పరదా) తీయకూడదని వారించింది…అప్పుడు ఆ అమ్మాయి…రక్తం ధారలుగా పోతుంది..సెఫ్టిక్ లాంటిది అయితే చాలా ప్రాబ్లమ్… అయినా ఏ సాంప్రదాయానికైనా సాటి మనిషి ప్రాణాలు నిలబెట్టడం కంటే గొప్ప ఏముంటుంది చెప్పు? అన్నది..నా కాలుకి కట్టు కట్టుకుంటూ..!
అంతలోనే లిఫ్ట్ బాగై, గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చింది.! హలో..హలో…అనే నా మాటలను సైతం పట్టించుకోకుండా ఆ అమ్మాయి అక్కడి నుండి వేగంగా అడుగులేసుకుంటూ వెళ్లిపోయింది.! మనసులోనే ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకున్నాను.!