ఆధ్యాత్మికం

వారంలో ఈ 2 రోజులు ఎవరికి డబ్బు ఇవ్వకూడదా.. ఇస్తే కలిగే నష్టం మామూలుగా ఉండదు..!!

భారత దేశంలో చాలా మంది ఇప్పటికీ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు.ఏదైనా శుభకార్యం చేయాలంటే దానికి రోజు,సమయం, తేదీ, ముహూర్తం లాంటివి చూసుకొని చేస్తూ ఉంటారు.. అలాగే కొన్ని పనులు చేయాలంటే కూడా కొన్ని ప్రత్యేక దినాల్లో చేయరు.. ముఖ్యంగా డబ్బు విషయంలో ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది మంగళవారం రోజు అప్పు ఇవ్వరు.. తెచ్చుకోరు.. కారణం మంగళవారం అనేది కుజునికి సంకేతం.. కుజుడు దారిద్రి కుమారుడు.. కుజ గ్రహం మన భూమి కంటే దాదాపుగా సగం చిన్నగా ఉంటుంది.. అందుకే భూమిపై నివసించే వారికి కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందట.. కుజుడు నష్టాలకు ప్రమాదాలకు ప్రధాన కారకుడు..

అందుకే కుజ గ్రహం ప్రభావం ఎక్కువగా ఉండే మంగళవారం రోజున శుభ కార్యాలు చేయరు.. క్షౌరం చేయించుకోరు, గోళ్ళు కూడా కత్తిరించుకోరు.. అన్నిటికంటే ముఖ్యంగా మంగళవారం రోజున అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమని నమ్ముతారు. అలాగే ఆ రోజున అప్పు తీసుకున్నా కానీ అది అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని నమ్ముతారు.. అందుకే చాలామంది మంగళవారం మరియు శుక్రవారం రోజున ఎవరికి డబ్బు ఇవ్వరు, అలాగే డబ్బులు తీసుకోరు కూడా.. ఎందుకంటే డబ్బు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు కాబట్టి..

do not give money to any body on these days

అలాగే మంగళవారం రోజున పుట్టింటి నుంచి ఆడపిల్లలను కూడా పంపరు.. దీనికి కూడా ప్రధాన కారణం మన ఇంటి ఆడ పిల్లలు లక్ష్మీదేవిగా భావిస్తూ వుంటాం. సాధారణంగా సంపాదించే శక్తి ఉన్నవాడు సంపాదిస్తూనే ఉంటాడు. ఖర్చు చేసే వ్యక్తి ఖర్చు చేస్తూనే ఉంటారు.. అయితే ఈ రెండు రోజులైనా కనీసం సోమరిపోతు తనాన్ని ఆపాలని ప్రయత్నంతో ఇలా కొన్ని నియమాలు పెట్టారని కొందరు అంటారు.. అలాగే అమావాస్య రోజు కూడా అప్పు ఇవ్వరు.. ఇదంతా బాగానే ఉన్నా ఈ రెండు రోజుల్లో ఏదైనా ఆపద సమయం వస్తే ఎలా అని చాలామందికి ఆలోచన వచ్చి ఉంటుంది.. కానీ నియమం ఆపద సమయంలో పనికి రాదట.. ఆపదలో ఉంటే ఇస్తే ఇచ్చిన వారికి మరింత ధనలాభం పెరుగుతుందని అంటారు.

Admin

Recent Posts