Off Beat

దేవుడు ఉన్నాడా.. లేడా.. అన్న ప్ర‌శ్న‌కు ఓ సాధువు చెప్పిన స‌మాధానం ఇదే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు&period; స్వామీ&excl; నిజంగా దేవుడున్నాడంటారా&quest; కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను&period; సాధువు తల ఎత్తి అతని వంక చూసి&comma;&period;ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు&period; దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది&period; దయచేసి ఆయన చిరునామా చెప్తారా&quest; పరిహాసంగా అడిగాడు అతను&period; అది గుర్తించి&comma; పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు&period; నీకో కధ చెప్తా విను&period; అది నీ సందేహం తీర్చచ్ఛు&period; పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు&period; ఆమె అందుకు ఒప్పుకోలేదు&period; నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను&period;&period; చెప్పిందా పిల్ల&period; ఎవర్ని చేసుకుంటావయితే&quest; ప్రశ్నించింది తల్లి&period; మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు&quest; ఆడిగిందా అమ్మాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఊళ్ళో ఏం ఖర్మ&quest; మన దేశం&period;లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు చెప్పాడు తండ్రి&period; అయితే ఇంకేం&quest; ఆయన్నే చేసుకుంటాను&period;&period; చెప్పిందా పిల్ల&period; అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి&period; తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక సరే అన్నాడు&period; ఆ పిల్ల రాజధానికి చేరుకుంది&period; ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు&period; నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా&comma; ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది&period; ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు&quest; అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది&period; అతని దగ్గరకు వెళ్లి ఆ&period;విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది&period; ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప&period; చేసుకుంటే అత‌ణ్ణే చేసుకోవాలి అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84518 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;sadhu&period;jpg" alt&equals;"a sadhu answer to a question whether god is there or not " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది&period; అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా&comma; ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు&period; అది కుయ్యోమంటూ పరిగెత్తింది&period; ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది&period; కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు&period; దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది&period; ఆ యువకుడు ఎవరో కాదు&period; ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే&period; కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది&period; దేవుడికోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది&period; అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు&period; అదే దేవుని చిరునామా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts