Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

దేవుడు ఉన్నాడా.. లేడా.. అన్న ప్ర‌శ్న‌కు ఓ సాధువు చెప్పిన స‌మాధానం ఇదే..!

Admin by Admin
May 7, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు. స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా? కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను. సాధువు తల ఎత్తి అతని వంక చూసి,.ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు. దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా? పరిహాసంగా అడిగాడు అతను. అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు. నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు. పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను.. చెప్పిందా పిల్ల. ఎవర్ని చేసుకుంటావయితే? ప్రశ్నించింది తల్లి. మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు? ఆడిగిందా అమ్మాయి.

మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు చెప్పాడు తండ్రి. అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను.. చెప్పిందా పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి. తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక సరే అన్నాడు. ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా, ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు? అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది. అతని దగ్గరకు వెళ్లి ఆ.విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది. ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప. చేసుకుంటే అత‌ణ్ణే చేసుకోవాలి అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది.

a sadhu answer to a question whether god is there or not

ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే. కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు.

మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. దేవుడికోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. అదే దేవుని చిరునామా.

Tags: god
Previous Post

నాని హిట్ 3 సినిమాలో చేసిన ఈ అతిపెద్ద మిస్టేక్‌ను మీరు గ‌మ‌నించారా..?

Next Post

పాకిస్థాన్ టెర్ర‌రిస్టులపై భార‌త్‌ దాడులు.. ఆప‌రేష‌న్ సింధూర్ అనే ఎందుకు పేరు పెట్టారు..?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.