Off Beat

గింజ నేర్పిన పాఠం.. ఎప్ప‌టికీ పాజిటివ్ దృక్ప‌థంతోనే ఉండాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక ఇంటి అరుగు మీద కూర్చుని రేగుపళ్ళు తింటున్నాడో పదేళ్ళ పిల్లాడు&period; ఒకో పండూ తిని గింజను మట్టిలోకి ఊస్తున్నాడు&period; వాటిలో ఒక గింజ తోటిగింజలతో ఆశగా ఇలా అంది&period; ఇప్పుడు మనం ఆ మట్టిలో పడి మొలకెత్తుతాం కదూ&period; ఇంత చిన్నగా ఉన్న మనం మొలకై&comma; మొక్కై&comma; మానై మన అమ్మంత పెద్దవుతాం&period; నీడను&comma; పళ్ళను ఇచ్చేంత గొప్పస్థాయికి వెళ్తాం&period; తలుచుకుంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంది&period;&period; అంటూ మురిసిపోయింది&period; ఇంకో గింజ అంత ఆశ పడకు&period; అరుగు ముందు నేల చూశావా&quest; గడ్డి పరక కూడా లేకుండా ఎలా ఉందో&excl; ఈ ఇంటి ఇల్లాలు ఇక్కడంతా శుభ్రం చేసేసి ముగ్గు వేస్తుందనుకుంటా&period; మనం పొరపాటున మట్టిలో మిగిలి మొలకెత్తినా అంతే&period; పీకి పారేస్తుంది&period; ఎదగనిచ్చి ఇంటికి అడ్డంగా మహావృక్షంగా మారనిస్తుందా ఏమిటి&quest; అంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కింద పరిశీలించిన మిగతా గింజలు అవునంటూ ఒప్పుకున్నాయి నిరుత్సాహంగా&period; కానీ మొదటి గింజ పట్టుదలగా ఇలా అంది&period; సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ప్రకృతి కూడా సహకరిస్తుంది&period; నాకు చెట్టుగా మారాలని ఆశగా ఉంది&period; అది పర్యావరణానికి&comma; ప్రాణులకు మేలే కానీ కీడు కాదు&period; కాబట్టి నా కోరిక తీరుతుందని నమ్ముతున్నాను&period; ఇంతలోనే ఆ పిల్లవాడిని తల్లి గద్దించింది&period; మట్టిలో గింజలు ఉమ్మవద్దు&period; ఈ పళ్ళెంలో వెయ్యి&period; తినడం అయ్యాక అన్నీ ఆ చెత్తబుట్టలో వెయ్యి&period;&period; అంటూ ఒక పళ్ళెం ఇచ్చింది&period; ఇప్పుడేమంటావు చెప్పు&quest; మన బతుకులు చెత్తబుట్ట పాలు&period; అంది నిరాశపరిచిన గింజ&period; మిగతా గింజలు అవునంటూ ఒప్పుకున్నాయి నీరసంగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79200 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;seed&period;jpg" alt&equals;"a seed given a lesson about positive attitude " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి గింజ మౌనంగా ఉంది&period; ఒక నమ్మకంతో వేచి ఉంది&period; కాసేపటికి తినడం ముగించిన పిల్లవాడు ఆ రేగు గింజలను అమ్మ చెప్పినట్లే చెత్త బుట్టలో వేశాడు&period; మర్నాడు వీధులు శుభ్రం చేసేవారు వచ్చి అందరి ఇళ్ళలో చెత్తను సేకరించి&comma; ఊరి బయటకు తరలించారు&period; ఆ క్రమంలో వాహనం కుదుపులకు కొన్ని గింజలు బండి సందులలో నుండి జారి&comma; బాటపై పడ్డాయి&period; వాటిలో మొదటి గింజ కూడా ఉంది&period; ఆ బాట వెంట వెళ్ళే కొన్ని వాహన చక్రాలకు అంటుకుని తోటి గింజలు ఒక్కోటీ కనుమరుగైనాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక కాకి ఈ గింజను ముక్కున కరుచుకుని రివ్వున ఎగిరి ఒక భవనం గోడపై వాలింది&period; ముక్కుతో పొడిచి చూసి అందులో మిగిలి ఉన్న గుజ్జుని తిని&comma; అక్కడే వదిలి ఎగిరిపోయింది&period; దాని రెక్కల వేగానికి గింజ దొర్లి కింద పడింది&period; మట్టిలో పడి అలా ఓర్పుగా వేచి చూస్తూ ఉంది&period; కొన్నాళ్ళకు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది&period; పెద్ద వర్షం కురిసింది&period; ఎత్తులో ఉన్న కొంత మట్టి జారి పల్లంలో ఉన్న గింజను కప్పేసింది&period; మట్టిలో మునిగి&comma; నీటితో తడిసి ఊపిరి పీల్చుకున్న గింజ కొద్ది రోజులకే మొలకై&comma; తలెత్తి లోకాన్ని చూసింది&period;&period; సంతోషంగా నవ్వింది&period; గాలి దానిని హాయిగా నిమిరి అభినందనలు తెలిపింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts