మీకు ఫాంటమ్ కాల్ ఉందా..లేదంటే ఫాంటమ్ టెక్స్ట్ ఉందా….స్మార్ట్ ఫోన్ లో ఇవి కొత్త యాప్సా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకుండానే మొబైల్ వైబ్రేట్ అవుతున్నట్టు అనిపిస్తే కచ్చితంగా మీకు ఫాంటమ్ కాల్ ఆర్ టెక్స్ట్ ఉన్నట్టే… చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా కొద్ది సేపు కూడా ఉండలేని వాళ్లు చాలామందే..అలాంటివారిలో ఖచ్చితంగా ఇది కనపడుతుంది..ఇది రోగం కాదు …కానీ జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే.నిరంతరం అందులో ఏదో ఒకటి ప్రెస్ చేస్తూనే ఉంటుంటాం.మన చుట్టు ఎవరున్నారన్నది పట్టించుకోనంతగా మొబైల్లో మునిగిపోతున్నాం.ఆఖరికి మహేశ్ అన్నట్టుు లైఫ్ అంటే లైక్,షేర్ లతోనే సరిపోతుంది..ఒక్కమాటలో చెప్పాలి అంటే మందు, డ్రగ్స్ లకు బానిసలైనట్టు ప్రపంచంలో 80 % మంది మొబైల్ కి అడిక్ట్ అయిపోయారు.మొబైల్ ను ఎక్కువగా వాడడం కళ్ళకి అలాగే బ్రెయిన్ కి మంచిది కాదు అని తెలిసినా ఈ అలవాటుని మానుకోలేరు.తత్ఫలితంగా ఎన్నో నష్టాలు ఎదుర్కోక తప్పదు.వాటిల్లో ఒకటే ఫాంటమ్ కాల్..
దీని వలన అంత ప్రాబ్లమేమి లేకపోయినప్పటికీ ,లాంగ్ టర్మ్ లో మాత్రం సమస్య ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.తరచు మనం మొబైల్ తోనే ఉండడం వల్ల ఫోన్ రాకపోయినా వచ్చినట్టు వైబ్రేట్ అవ్వకపోయిన అవుతున్నట్టు భ్రమ కలుగుతుంది.ఇలాంటి లక్షణాలను ఎక్కువగా టీనేజ్ వయసు గలవారిలో ఉన్నట్టు తెలిపాయి కొన్ని సర్వేలు.కాబట్టి వీలైనంత తక్కువగా మొబైల్ వాడితే మంచిది.మోభైల్ వాడటాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మన కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ ,మెడిటేషన్ వైపు మళ్లించడం హెల్ప్ అవుతుంది.