మన దేశంలో మగాడు రెండో పెళ్లి చేసుకుంటే చట్ట రీత్యా అది నేరం అవుతుంది. ఒకరు ఒకరినే వివాహం ఆడాలి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భార్యా భర్తలలో భార్య ఒప్పుకుంటే భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా చట్టం వీలు కల్పించింది. అలాంటి పరిస్థితుల్లో కొత్తగా పెళ్లి చేసుకునే భార్యకు, భర్తకు, పాత భార్యకు ముగ్గురికీ అండర్ స్టాండింగ్ ఉండాలి. ఇలా లేకపోతే అది వీలు కాదు. అయినప్పటికీ నేటి తరుణంలో చాలా మంది మగాళ్లు రెండో పెళ్లి చాటు మాటున చేసుకుని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి కాపురాలు కూడా చేస్తున్నారు. కానీ మీకు తెలుసా..? మన దేశంలో మగాడు రెండో పెళ్లి చేసుకోవడం నేరమేమో గానీ, ఆ దేశంలో మాత్రం కాదు. ఇంకా చెప్పాలంటే ఆ దేశంలో రెండో పెళ్లి చేసుకునే మగాడికి ప్రభుత్వం కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది. ఇంతకీ ఆ దేశం ఏమిటంటే…
ఇంకే దేశం.. దుబాయ్.. అవును, అదే. అక్కడ మగాళ్లు రెండో పెళ్లి చేసుకోవచ్చు. దీన్ని అక్కడి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. రెండో పెళ్లి చేసుకున్న వారికి పలు సదుపాయాలను కూడా దుబాయ్ ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యంగా రెండో పెళ్లి చేసుకున్న మగాళ్లను గౌరవంగా చూస్తారు. దీంతోపాటు రెండు పెళ్లిళ్లు చేసుకున్న పురుషులకు షేక్ జాయద్ హౌసింగ్ పథకం కింద ఇంటి అద్దెను చెల్లిస్తారు. అంటే వారికి ఇంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదన్నమాట. అంతేకాదు ఈ ప్రయోజనం రెండవ భార్యకు కూడా వర్తిస్తుందట.
అయితే దుబాయ్ దేశ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో తెలుసా..? ఆ దేశంలో పెళ్లి కాని మహిళల సంఖ్య అధికంగా ఉందట. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి అక్కడి ప్రభుత్వం ఈ విచిత్ర నిర్ణయం తీసుకుంది. దీన్ని అక్కడ అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అక్కడి పురుషులు రెండో పెళ్లి కూడా చేసుకోవచ్చు. అలా రెండో పెళ్లి చేసుకునే పురుషులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. అలాంటి వారిని సమాజంలో గౌరవంగా కూడా చూస్తున్నారు. ఏది ఏమైనా దుబాయ్‌లో అమలులోకి వచ్చిన ఈ కొత్త చట్టం భలే విచిత్రంగా ఉంది కదా.