Off Beat

జీన్స్ ప్యాంటు జిప్ పై ఉండే “YKK” అర్థం మీకు తెలుసా..?

మనం మార్కెట్ లోకి వెళ్తే ఎన్నో రకాల ఫ్యాషన్ బట్టలను కొనుక్కుంటాం. ఏదైనా కొత్త ఫ్యాషన్ వచ్చిందంటే చాలు చాలా మంది వెంటనే వెళ్లి కొనుగోలు చేస్తారు. పాతవి అయ్యాక వాటిని పడేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా జీన్స్ ప్యాంట్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.. కానీ ఈ ప్యాంటు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీరు తెలుసుకోవాల్సిందే.. అది మీరు ఎప్పుడూ కూడా గమనించి ఉండరు.

ముఖ్యంగా జీన్స్ ప్యాంటు జిప్పు పైన “YKK” అనే అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. ఎంత పెద్ద బ్రాండ్ బట్టలు కొన్నా పైన మాత్రం “YKK” అని తప్పనిసరిగా రాసి ఉంటుంది. మరి ఆ అక్షరాలే ఎందుకు ఉంటాయని అనుమానం మీకు తప్పనిసరిగా వస్తుంది. దానికి అర్థం ఏమిటంటే “YUSHUDA KOMBYO KOBISHIKI GAYSHA” నోరు తిరగడం లేదు కాదు. ఇది YUSHUDA ఇండస్ట్రీకి చెందిన ప్రోడక్ట్. జపాన్ కు చెందిన టాడావో యుషుడా అనే వ్యక్తి1934 లో దీన్ని స్థాపించారు. 71 దేశాలలో 109 యూనిట్లను కలిగి ఉన్న ఈ సంస్థ నుంచి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 శాతం జిప్పులు ఉత్పత్తి అవుతున్నాయి.

do you know the meaning of ykk on jeans pant zips

ఈ కంపెనీ కేవలం కి జిప్పులనే కాకుండా, జిప్పు లను తయారు చేసే మెషిన్ లను కూడా తయారు చేస్తోంది. జార్జియాలో “YKK” కు రోజుకు 70 లక్షల జిప్పు లు ఉత్పత్తి చేసే పెద్ద కంపెనీ ఉంది. 1966 లో “Y” షేప్ లో ఉండే జిప్పులను ఈ సంస్థ మొదటిసారిగా తయారుచేసింది. నాణ్యమైన ప్రోడక్ట్ అందిస్తుండటంతో 1968 తర్వాత కంపెనీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా దేశాల్లో వారి ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసి జిప్పు లను తయారు చేసి వివిధ రకాల బ్రాండ్లకు సరఫరా చేస్తోంది. ఈ YKK సంస్థకు చాలాకాలంపాటు అసలు పోటీలేదు. ప్రస్తుతం ఈ సంస్థ కు పోటీగా కొన్ని సంస్థలు వచ్చినా ఇప్పటికీ చాలా జీన్స్ పాంట్స్ కి ఈ కంపెనీ జిప్పులే ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఈ కంపెనీ దుస్తులు, బ్యాగులు కూడా తయారు చేస్తోంది.

Admin

Recent Posts