చెంఘీజ్ ఖాన్ మంగోలియాలో పుట్టిన ఒక గిరిజన తెగ నాయకుడు… మంగోలుల మీద దండయాత్ర సమయంలో అతని యుద్ద ప్రావీణ్యం అమోఘమైనది… అతనికి యుద్ధం చేయడం ఒక్కటే తెల్సు…. వెనుతిరగడం, భయపడటం తెలియదని చరిత్ర కారుల మాట. ఇతను 1162 -1227( BC /AD తెలీదు) వరకు బతికినట్టు ఆధారాలు వున్నాయి… సుమారు తన 65 వ ఏట చనిపోయాడని చెప్తున్నారు.
ఐతే అతనికి యుద్ధం చేయడం తో పాటు….కొన్ని రహస్య వైద్య పద్దతులు కూడా తెల్సు…గిరిజన తెగ లో వుండటం మూలాన ప్రతి చెట్టు, కాయ, పండు అన్నింటీ ఔషధ విలువలు తెల్సు…దానితో పాటు జంతుజాల శరీర నిర్మాణం, వాటి వల్ల వచ్చే రోగాలు, వాటితోనే నయం అయ్యే రోగాల గురించి కూడా అప్పట్లోనే చాలా అవగాహన కలిగి వున్నాడు….
యుద్ధం సమయంలో తన వెంట బండెడు ఈగలను తోలుకు వెళ్ళేవాడు…ఎందుకో తెలుసా ? ముందుగా చెప్పినట్టు అతనికి తెల్సిన రహస్య వైద్య పద్దతులు లో ఇది కూడా వుంది…..యుద్దములో గాయపడిన సైనికులకి ఈ ఈగల లార్వాలను ఆ గాయాల మీద వదిలితే అవి గాయం చుట్టూ వున్న చెడు చర్మం, చెడు రక్తం పీల్చేవి. తద్వారా వారు వేగంగా గాయాల నుండి కోలుకొని మళ్ళీ యుద్దానికి సిద్దం అయ్యేవారు…ఇందుకే తన వెంట ఈగ లార్వాలు, ఈగలను తోలుకెళ్లే వాడు.