అమెరికాకు చట్టబద్ధమైన పద్దతిలో వెళ్లి అక్కడ సంపాదించి అక్కడే స్థిరపడాలని, వెళ్లిన వాళ్ళంతా అక్కడ సంతోషంగా వున్నారా ? మీరు దగ్గరగా చూసినవారి ఉదాంతాలు ఏమి చెబుతున్నాయి ? అంటే.. నాకు ఎవరితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా నేను అక్కడ ఉన్న నాలుగు నెలలు చూసినది. లోపల ఎంత టెన్షన్ ఉన్నాగాని భార్య భర్తలు ఇద్దరూ తయారై ఎవరి కారులో వాళ్లు డ్యూటీలకు వెళ్తారు. ఎప్పుడూ కారు ప్రయాణం ఒక అనుభూతి. డ్రైవింగ్ నేర్చుకోవటం కూడా చాలా కష్టం అక్కడ. లైసెన్సు వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పనికిరాదు.
నాకు తెలిసి ఇక్కడ హైదరాబాదులో నా ఇంటు చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు కోటీశ్వరులు ఇక్కడ ప్యాలెస్ లో ఉన్నాయి కోట్లు ఆస్తులు ఉన్నాయి కానీ వాళ్ల పిల్లలు అమెరికాలోనే ఉన్నారు న్యూ జెర్సీలో ఉన్నారు టెక్సాస్ లో ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఇక్కడ పాత మిత్రులతో కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. వారు అనేది ఏమిటి అంటే ఈ ట్రాఫిక్కు పొల్యూషన్ కి చాలా బాధపడిపోతారు. అమెరికాలో నగరాలలో మాత్రమే పొల్యూషన్ ఉంటుంది న్యూయార్క్ వాషింగ్టన్ యాక్సాస్ చికాగో. కౌంటిల దగ్గర పొల్యూషన్ ఉండదు ఖాళీ ఖాళీగా ఉంటాయి. సాయంత్రం ఏడు దాటింది అంటే ఎవరో కనపడరు ఎవరి తలుపులు తీసి ఉండవు.
కానీ ఎక్కువగా అక్కడ కౌంటి లు ఉంటాయి. నగర వాతావరణం ఉండదు. ఎక్కడో ఒకటి రెండు థియేటర్స్ ఉంటాయి షాపింగ్ మాల్ ఉంటుంది. దేనికైనా కారులో వెళ్లి రావాల్సిందే ఆ తృప్తి వేరు. పెట్రోల్ ధర 2018లో మూడున్నర డాలర్ లు. ఏ భాషకు చెందిన వాడిలో అక్కడ కలుస్తూ ఉంటారు ఫంక్షన్లో చేసుకుంటూ ఉంటారు. మా అమ్మాయి ఉన్నచోట గుజరాత్ వారు ఉన్నారు మహారాష్ట్ర ఉన్నారు తెలుగువారు ఉన్నారు అందరూ కలిసి అప్పుడప్పుడు ఫంక్షన్ చేసుకుంటారు. ఇలాంటి జీవితానికి అలవాటు పడి అదే చాలా బాగుంది అనిపిస్తుంది వాళ్లకు. బంధువులు వెళితే వాళ్ల కార్లలో తిప్పుతారు ఒకసారి అనగా శనివారం ఆదివారం. అంటార్కిటికా సిటీ అనే ఊరు ఉంది సముద్రం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందరూ సముద్రం ఒడ్డున ఉంటారు వేలమంది కేవలం బికినీలు ధరించి ఉంటారుఆడవారు. ఎవరి పట్టించుకోరు వాళ్ళ దారి వాళ్లది. 5వేల డాలర్ల జీతం అంటే సుమారు ఆరు లక్షల రూపాయలు.
ఈ రకంగా వాళ్ళకి డాలర్ల జీవితం అద్భుతంగా ఉంటుంది. పిల్లల చదువులు చాలా బాగుంటాయి కాన్సెప్ట్ స్టడీస్. 7 8 తరగతి పిల్లలు కూడా పెద్ద బ్యాగ్ ఉండదు 4. 5 పుస్తకాలతో వెళ్ళిపోతారు.. లాప్టాప్ కంపల్సరిగా ఉంటుంది. ఇండియన్సు బాగా చదువుతారు క్లాసులో ఫస్ట్ వస్తారు అనే పేరు ఉంది. నాకు తెలిసి ఆరో క్లాస్ వరకు మా మనవడు క్లాస్ ఫస్ట్.