పాము, ముంగిస పోట్లాడుకుంటుంటే చాలా మంది చూసే ఉంటారు. అయితే చాలా వరకు ఇలాంటి ఫైటింగ్స్‌లో ముంగిసదే పైచేయి అవుతుంటుంది. పాము మరీ బలంగా ఉంటే తప్ప 70 నుంచి 80 శాతం మేర ముంగిస గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముంగిస కనిపిస్తే పాము, పాము కనిపిస్తే ముంగిస.. ఎందుకు ఫైట్ చేస్తాయి..? ఇవి శత్రుత్వాన్ని ఎందుకు కలిగి ఉన్నాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాతి వైరం అనేది పలు జీవుల మధ్య మొదటి నుంచి ఉంది. సృష్టి మొదలైనప్పటి నుంచి ఇది ఉందని సైంటిస్టులు కూడా చెబుతుంటారు. ఎలాగైతే కుక్క – పిల్లి, పిల్లి – ఎలుక, పులి – జింక ఇలా జాతి వైరం అనేది జీవుల మధ్య ఏర్పడిందో పాము – ముంగిస మధ్య కూడా జాతి వైరం మొదటి నుంచి ఏర్పడింది. అందుకనే ఒకదానికొకటి ఎదురు పడితే రక్తాలు వచ్చేట్లు ఫైట్ చేసే వరకు వదలవు. చివరకు ఏదో ఒక జీవి విజయం సాధిస్తుంది. కానీ దాదాపుగా ముంగిసకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
అయితే పాము కాటు వేసినా ముంగిస ఎందుకు చావదు అని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ముంగిస శరీరం ప్రత్యేకమైనది. పాము కాటును, విషాన్ని సైతం తట్టుకోగలదు. కనుకనే తనకు తాను రక్షణ కల్పించుకునేందుకు గాను ముంగిస పాముతో పోరాటం చేస్తుంది. ముంగిస చాలా వేగవంతమైంది. చాలా చురుగ్గా కదులుతుంది. దాదాపుగా అది పాము కాటుకు గురి కాదు. ఒక వేళ పాము కాటు వేసినా తట్టుకునే శక్తి ముంగిసకు ఉంటుంది. ఈ సృష్టిలో పాము కాటును తట్టుకునే శక్తి ముంగిసకు తప్ప మరే జీవికి లేదు అంటే అతి శయోక్తి కాదు. ఇక రెండింటి మధ్య ఉన్న జాతి వైరం కారణంగానే ఇవి పోట్లాడుకుంటాయి తప్ప ప్రత్యేకంగా వీటి మధ్య శత్రుత్వం అన్నది లేదు.