Off Beat

సైన్స్ ప్రకారం భూమిపై అత్యంత అందమైన మహిళ ఎవరు?

ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరు? అనే ప్రశ్నకు ఒక శాస్త్రీయ అధ్యయనంలో ఖచ్చితమైన సమాధానం కనుగొన్నారు. సైన్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ ఎవరు? ఆమె వివరాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచ సుందరీమణులుగా చాలా మంది మహిళలు గుర్తింపు పొందారు. సినీ ఇండస్ట్రీలో అలనాటి క్లియోపాత్రా, మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ నుంచి నేటి ఐశ్వర్య రాయ్ వరకు కొందరు హీరోయిన్‌లు ఈ గౌరవం దక్కించుకున్నారు. జోడి కోమర్‌, ప్రముఖ టీవీ షో ‘కిల్లింగ్ ఈవ్’లో సపోర్టింగ్ రోల్‌తో పాపులర్ అయింది. ఆమె ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా అందరితో పిలుచుకునే హక్కును పొందింది. 31 ఏళ్ల జోడి కోమర్‌ ‘ఫ్రీ గై’, ‘ది లాస్ట్ డ్యూయల్’ వంటి సినిమాల్లో నటించింది.

లండన్‌కు చెందిన కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డిసిల్వా డిజిటల్ ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించి 2023లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సెలబ్రెటీల ముఖ లక్షణాలను మెజర్ చేసి సౌందర్య శాస్త్రంలోని గ్రీక్ గోల్డెన్ రేషియోతో పోల్చారు. ఈ క్రమంలో జోడీ కమెర్ ముఖం గ్రీకులకు 94.52% దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా శాస్త్రీయంగా నిరూపితమైంది. ఇతర సెలబ్రెటీలు జెండయా (94.37%), బెల్లా హడిద్ (94.35%), బియాన్స్‌ (92.44%), టేలర్ స్విఫ్ట్ (91.64%), కిమ్ కర్దాషియాన్ (91.28%), దీపికా పదుకొణె (91.22%) తరువాతి స్థానంలో నిలిచారు. గోల్డెన్ రేషియో అనేది గణిత శాస్త్ర కాన్సెప్ట్. దీన్ని మొదట గ్రీకులు రూపొందించారు. ఏదైనా ఫీచర్‌ (సుమారు 1.618) నిష్పత్తికి దగ్గరగా ఉంటే, అది మరింత సౌందర్యంగా కనిపిస్తుంది. గోల్డెన్ రేషియో సహజంగా పువ్వులు, మేఘాలు, జంతువులు, మానవ శరీరాల్లో కూడా కనిపిస్తుంది.

jodie comer is the most beautiful lady according to science

సర్జన్స్, బ్యూటీ ఎక్స్‌ఫర్ట్స్ ముక్కు, నోరు, కళ్ల మధ్య అంతరం వంటి ముఖ అంశాలను మెజర్ చేస్తారు. వాటిని గోల్డెన్ నిష్పత్తితో సరి పోల్చుతారు. లియోనార్డో డా విన్సీ అనే రచయిత తన రచనల్లో గోల్డెన్ రేషియోను ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా మోనాలిసా చిత్రాన్ని ఆ విధంగా గీశారు. లండన్‌కు చెందిన కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డిసిల్వా గతంలో నిర్వహించిన అధ్యయనంలో మరో ఇద్దరు మహిళలు ఈ గౌరవం దక్కించుకోవడం విశేషం. 2022లో గోల్డెన్ రేషియో ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా ‘బెల్లా హడిద్’ గుర్తింపు పొందారు. 2021లో ఈ గౌరవం అంబర్ హియర్డ్‌కు దక్కింది. ఆ ఏడాది ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా గుర్తింపు పొందిన జోడి కోమర్‌ నుంచి భవిష్యత్తులో మరో మహిళ ఈ కిరీటాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి

ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది ప్రముఖుల ముఖాలను మెజర్ చేస్తుండటంతో అధ్యయనం నమూనా పరిమాణం పెరుగుతూ పోతోంది. గతంలో ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళలుగా ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, టేలర్ స్విఫ్ట్, బియాన్స్‌, కేట్ విన్స్‌లెట్, మధుబాల, ఎలిజబెత్ టేలర్, బో డెరెక్, మార్లిన్ మన్రో, అవా గార్డ్నర్ వంటివారు గుర్తింపు పొందారు.

Admin

Recent Posts