Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

Admin by Admin
July 4, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రకాష్ నర్వస్ గానే ఆ ఆఫీసులోకి అడుగు పెట్టాడు . ఆఫీస్ పోష్ గా ఉంది. ముగ్గురు కుర్రాళ్ళు లాప్టాప్ లు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఒక అమ్మాయి ఫైల్ చూస్తూ ల్యాండ్ లైన్ లో మాట్లాడుతోంది. ప్రకాష్ అలాగే నిలబడిపోయాడు. ఇంతలో అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చాడు. ఏం కావాలి అని ప్రకాష్ ని అడిగాడు. నరేంద్ర సార్ ని కలవాలి అన్నాడు ప్రకాష్. ఆఫీస్ బాయ్ ప్రకాష్ ని ఎగాదిగా చూసాడు. మాసిన బట్టలు , చేయని గడ్డం, పాత చెప్పులు ఇలాంటి వాళ్ళతో ప్రొప్రయిటర్ కు ఏం పనా అనుకున్నాడు. ఒక స్లిప్ ఇచ్చి మీ పేరు రాయండి, సార్ కు చూపించి ఆయన రమ్మంటే పిలుస్తాను అన్నాడు. ప్రకాష్ ఆ స్లిప్ లో తన పేరు మొబైల్ నెంబర్ అలాగే క్లాస్మేట్ అని రాసి ఇచ్చాడు . నరేంద్ర, ప్రకాష్ కలిసి కాలేజీ లో చదివారు. నరేంద్రకు తన జ్ఞాపకం ఉంటానో లేదో ప్రకాష్ కి డౌటే .ఆఫీస్ బాయ్ దాన్ని తీసుకొని లోపలికి వెళ్లి ఒక రెండు నిమిషాలలో అవతలికి వచ్చిసార్ రమ్మంటున్నారు రండి అని క్యాబిన్ కు దారి చూపించాడు.

ప్రకాష్ బెరుకుగానే లోపలికి వెళ్ళాడు. ప్రకాష్ వెళ్ళిన తక్షణం నరేంద్ర అతనితో కరచాలనం చేశాడు . ఎలా ఉన్నావు ప్రకాష్ చాలా దినాలు అయింది కనపడి అని ఆప్యాయంగా పలకరించాడు. ప్రకాష్ కు బెరుకు తగ్గింది. ఇద్దరు తమ కాలేజ్ దినాల గురించి మాట్లాడుకున్నారు. నరేంద్ర ప్రకాష్ వాడిపోయిన మొహం చూసిప్రకాష్ నువ్వు టిఫిన్ చెయ్యి నేను తెప్పిస్తాను అని అన్నాడు. ప్రకాష్ వద్దు అనబోయాడు కానీ కడుపులో వేస్తున్న ఆకలి అతన్ని ఊరికనే ఉండమని ప్రేరేపించింది. ఆఫీస్ బాయ్ దోసె ఇడ్లీ టీ తెచ్చాడు. నరేంద్ర ప్రకాష్ కి తినమని చెప్పాడు. తనది బ్రేక్ఫాస్ట్ అయిందని తను ఏమి తీసుకోడని చెప్పాడు. మొహమాటపడుతూనే ప్రకాష్ అన్నిటిని తిని రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. తర్వాత నరేంద్రకు థాంక్స్ చెప్పాడు. నరేంద్ర.. ప్రకాష్ నా నుంచి ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. ప్రకాష్ చెప్పాడు నాకు ఇప్పుడు సరి ఐన ఉద్యోగం లేదు, అక్కడ ఇక్కడ చిన్నాచితక ఉద్యోగాలు చేస్తున్నాను. ఫాదర్ రిటైర్ అయ్యారు. ఆయన పెన్షన్ డబ్బులు ఆయన మందులకే సరిపోదు. అన్నిటికీ కష్టమే.. అని తన గోడు వెళ్లబోసుకున్నాడు.

not all who help you are friends story tells

న‌రేంద్ర.. ప్రకాష్ డోంట్ వర్రీ, నేను మా ఫ్రెండ్ కంపెనీలో మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని అప్పుడే ప్రకాష్ ఎదురుగానే తన ఫ్రెండ్ తో మాట్లాడాడు. తర్వాత ప్రకాష్ కు రేపు పొద్దున వెళ్ళు, అక్కడ మీకు ఉద్యోగం ఇస్తాడు నా ఫ్రెండ్ అని చెప్పాడు. ప్రకాష్ ఎంతో సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నరేంద్ర ప్రకాష్ చేతికి డబ్బు ఇచ్చి దీనితో మొదట నీకున్న అప్పులు తీర్చి వెయ్యి, తర్వాత మంచి డ్రెస్ కొనుక్కో. నువ్వు జాయిన్ అయిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి అని చెప్పాడు. ప్రకాష్ మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు తెలుపుకొని అక్కడి నుంచి వెళ్ళాడు. నరేంద్ర ఇచ్చిన డబ్బుతో ప్రకాష్ అప్పులు తీర్చేశాడు. తల్లిదండ్రులు కూడా కుదుటపడ్డారు. నరేంద్ర ప్రకాష్ కు తన పాత బైక్ ఇచ్చి దాన్ని ఆఫీస్ కు వెళ్లడానికి వాడుకోమని చెప్పాడు . తర్వాత ఒక దినం ప్రకాష్ ని ఆఫీస్ కు పిలిచాడు. అక్కడ కూర్చున్న ఒక అతనితో పరిచయం చేసి ప్రకాష్ ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్, నీ తల్లిదండ్రుల పేరు మీదుగా ఐదు లక్షలకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను, నీ పేరు మీదుగా 50 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. ప్రీమియం నేనే కడతాను.. అని చెప్పాడు.

ప్రకాష్ ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాడు. ఎంతో కృతజ్ఞతగా నరేంద్రకు నమస్కారం చేశాడు .తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. నరేంద్ర.. నేను స్నేహానికి నేను చాలా విలువ ఇస్తాను ప్రకాష్, నా స్నేహితుడికి సహాయం చేయడం నాకు దేవుడిచ్చిన మంచి అవకాశం గా భావిస్తాను.. అన్నాడు. ఇలాగే కొన్ని నెలలు గడిచాయి ఒకదినం సాయంకాలం ప్రకాష్ ఆఫీస్ నుంచి వస్తున్నాడు. అప్పుడు సడన్‌గా ఒక కారు వెనుక నుంచి వచ్చి ప్రకాష్ వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. అంత దూరాన ఎగిరి పడిపోయాడు ప్రకాష్. వెనుకగా వస్తున్న లారీ అతని మీదుగా వెళ్ళింది . అక్కడికక్కడే మరణించాడు ప్రకాష్. పోలీసులు వ‌చ్చారు. ఆంబ‌బులెన్స్ వచ్చింది . ప్రకాష్ వాళ్ళ తల్లిదండ్రులకు నరేంద్రకు కూడా సమాచారం తెలిసింది. నరేంద్ర తక్షణం వచ్చాడు. తనే ప్రకాష్ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశాడు. అంత్యక్రియలు పూర్తయిని తర్వాత ఓ రెండు లక్షలు డబ్బుని ప్రకాష్ తల్లిదండ్రులకు ఇచ్చి మీరు వాడుకోండి అని చెప్పాడు. ప్రకాష్ తల్లిదండ్రులు కంటనీరు పెట్టుకున్నారు నరేంద్ర ఔదార్యాన్ని కొనియాడారు. కానీ ప్రకాష్ పేరు మీద ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ 50 లక్షలు నామినీ గా ఉన్న నరేంద్రకు వచ్చిన విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

Tags: friends
Previous Post

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

Next Post

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

Related Posts

ఆధ్యాత్మికం

ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ప్పుడు ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

July 9, 2025
lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

July 9, 2025
ఆధ్యాత్మికం

ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు ఎందుకు తిన‌రు..?

July 9, 2025
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

July 9, 2025
lifestyle

ఆకుకూర‌లు లేదా కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!

July 9, 2025
information

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

July 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.