Off Beat

మనిషి చనిపోయిన తర్వాత మనమైతే పూడ్చడమో, కాల్చడమో చేస్తాం..కానీ కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారో తెలుసా..?

మనిషి చనిపోయిన తర్వాత మనమైతే మన ఆచార సాంప్రదాయం ప్రకారం పూడ్చడమో, కాల్చడమో చేస్తాం, కానీ కొన్ని ప్రాంతాల్లో అంత్యక్రియల తంతు వింతవింతగా చేస్తారు. అదే అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.! కొన్ని దేశాలల్లో అయితే శవాలను మమ్మీలుగా అలానే ఉంచుతారు. ఇంకొన్ని దేశాలలో మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు తల భాగాన్ని వేరు చేసి కేవలం మొండెం వరకే కాల్చివేస్తారు.తలను గుహల్లో రాళ్ల మధ్యలో ఉంచుతారు. చనిపోయిన శవం వృధాకాకుండా ఆకలితో ఉన్న పక్షులకు ఆహారంగా ఇచ్చే ఆచారం కూడా ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం వినని చూడని కొన్ని అంత్యక్రియ పద్ధతుల గురించి తెలుసుకోండి.

1. గొంతు నులిపివేయడం: ఒకప్పుడు మనదేశంలో భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాలని ఆమెను మంటల్లోకి తోసేవారు. (సతీసహగమనం). సేమ్ టు సేమ్ అలాంటి పద్ధతే దక్షిణ పసిఫిక్ లోని ఫిజి ప్రాంతంలో పాటిస్తున్నారు. ఎవరైనా తమ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే, ఆ శవం ఒంటరిగా వెళ్ళకూడదట. అందుకని ఆ కుటుంబంలోని ఎవరైనా సరే ఒకరు వారితో పాటు చనిపోవాలట.వారి కుటుంబంలోని మరో వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి గొంతుకు తాడు లేదా ఏదైనా బట్టను ఉపయోగించి గొంతును నులిపివేస్తారు. అలా గొంతునులిపి వేసే సమయంలో వారు ఎలాంటి బాధను అనుభవించరని, వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం.

people follow these different traditions when cremating dead bodies 2. గుహల్లో ఉంచడం: ఇరాక్, ఇజ్రాయిల్ దేశాలలో చనిపోయిన వ్యక్తులను ఊరికి చివరన గుహలలో వదిలివేసేవారట. ఆ శవాలను అలా ఉంచడానికి పెద్ద పెద్ద రాళ్ళను ఉపయోగిస్తారట. 3. నదిలో/ సముద్రంలో వేయడం: దక్షిణ అమెరికాలోని ఓ ప్రాంత ప్రజలు మృతదేహాలను సమృద్ధిగా పారుతున్న నదులలో లేదా సముద్రాలలో ఆ శవాలను పడేసి అంత్యక్రియలు జరుపుతారట. 4. శవాలను తినడం: న్యూగినియా మరియు బ్రెజిల్ దేశాలలో అక్కడి ప్రజలు మృతదేహాలను చాలా వింత పధ్ధతిలో అంత్యక్రియలు జరుపుతారు. ఆ శవాలను ముక్కలుగా చేసుకొని భుజిస్తారు. ప్రస్తుతం ఈ పధ్ధతి అక్కడ చాలా అరుదనే చెప్పాలి. 5. పక్షులకు ఆహారంగా: ఇతర మతాల ఆచారాల ప్రకారం పూడ్చడం, దహనం లాంటివి చేయకుండా పర్సియన్ దేశస్థులు శవాలను పక్షులకు, రాబందులకు ఆహారంగా వేస్తారు. ఆ శవం వృధా కాకుండా పక్షుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుందని ఈ విధంగా చేస్తారట. ప్రస్తుతం ఈ పధ్ధతి అక్కడ చాలావరకు తగ్గిందనే చెప్పాలి. రాబందులు కూడా చాలా వరకూ తగ్గిపోవడంతో,,, అక్కడి శవాలను సోలార్ ప్లేట్లపై ఉంచుతున్నారు. సోలార్ ప్లేట్ల వేడికి ఆ శవాలు అలా దహనమవుతాయి.

6. కాల్చివేయడం: హిందూమత ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఎలా అంత్యక్రియలు చేయాలనే దాన్ని అయిదు అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తిచేస్తారు. అందులో కట్టెలపై కాల్చివేయడం ఒక పధ్ధతి. కొన్ని శతాబ్దాల నుండి ఈ ఆచారం అమలులో ఉంది. 7.కొండ చివరపు అంచున ఉరితీయడం: చైనీయుల మత ఆచారంలో చనిపోయిన వారిని కొండ చివరన రెండు చెక్కల మధ్యన లేదా ఒక రాయికి వేలాడదీసి ఉరితీస్తారట. అలా చేయడం వలన వారు స్వర్గానికి వెళతారని వారి విశ్వాసం. 8.మమ్మీలు: మృతదేహాలకు బట్టలుకట్టి, ఆ శవాలను కాల్చివేయకుండా, పూర్చకుండా ఒక పెట్టెలో బంధిస్తారు. ఈజిప్ట్ దేశీయులు ఈ ఆచారాన్ని ఎక్కువగా వ్యవహరిస్తారు.ఈజిప్ట్ లో ఇప్పటివరకూ 3500పైగా మమ్మీలు ఉన్నాయట. ఇలా చేయడం వల్ల ఆ మమ్మీలు ఏదో ఒకరోజు తిరిగి బ్రతుకుతారని వారి ప్రగాడ విశ్వాసం. ఈ పద్ధతి కేవలం ఒక్క ఈజిప్ట్ కె పరిమితం కాలేదు, భారత్, శ్రీలంక, చైనా, టిబెట్, థాయిలాండ్ దేశాలలో ఈ ఆచారాన్ని ఫాలో అవుతూ అంత్యక్రియలు జరుపుతున్నారు.

9. ఖననం చేయడం: మనదేశంలో చాలావరకు మతాలు చనిపొయిన మృతదేహాలను మట్టిలో పూర్చిపెట్టి సమాధులు కడతారు. వేద కాలం నుండి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇస్లాం మరియు క్రిస్టియన్ మతస్థులు ఇదే ఆచారాన్ని అంత్యక్రియలలో పాటిస్తున్నారు. నోట్ : ఈ పద్దుతులు ఆయా దేశాలలోని కొన్ని అరుదైన తెగలు పాటించే సాంప్రదాయాలు …ఆ దేశంలోని అందరూ పాటిస్తారని కాదు.

Admin

Recent Posts