Off Beat

సింహం తోలు క‌ప్పుకున్న గొర్రె.. త‌రువాత ఏం జ‌రిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక రోజు ఒక వ్యాపారస్తుడు కొన్ని గొర్రెలతో అడవి దాటుతుండగా అందులో ఒక గొర్రె దారితప్పి ఆ దట్టమైన అడవిలోనే ఉండిపోయింది&period; అక్కడ క్రూరమృగాలు ఉంటాయి&comma; వాటి బారిన పడి చస్తానేమోనని గొర్రె చాలా భయపడింది&period; అందుకే దేనికంటా పడకుండా జాగ్రత్తగా ఉంటూ నెమ్మదిగా అటూ ఇటూ తిరగసాగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకరోజు గొర్రెకు ఒక సింహం తోలు కనబడింది&period; వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది&period; &OpenCurlyQuote;ఏ క్రూరమృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని చస్తూ బతుకుతున్నాను&period; ఈ తోలును కప్పుకుంటే నేను కూడా సింహంలా కనబడతాను&period; అప్పుడు నా జోలికి ఎవరు రారు’ అని అనుకుంది&period; వెంటనే గొర్రె ఆ తోలును తీసుకుని కప్పుకుంది&period; ఇప్పుడది వింత జంతువులా కనబడసాగింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గొర్రె ఆ కారం చూసి కుందేళ్ళు&comma; జింకలు&comma; ఎలుగుబంటులు&comma; నక్కలు భయంతో పరుగులు పెట్టాయి&period; చివరకు పులులు&comma; సింహాలు కూడా గతుక్కుమన్నాయి&period; అది చూసి గొర్రెకు చాలా సంతోషం కలిగింది&period; వాటిని ఇంకా భయపెట్టడానికి గొంతు కాస్త మార్చి విచిత్ర శబ్దాలు చేయడం&comma; కాలు నేలకు రాస్తూ జంతువుల మీదకు దాడి చేస్తున్నట్టు నటించడం చేయసాగింది&period; దానితో ఆ అడవి జంతువులన్నీ బిక్కచచ్చిపోయాయి&period; వాటి కంటి మీద కునుకు లేకుండా పోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75377 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sheep&period;jpg" alt&equals;"what happened to sheep under the skin of lion " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గొర్రె కడుపునిండా గడ్డిమేస్తూ యధేచ్ఛగా తిరగసాగింది&period; ఒకరోజు గొర్రె ఒక కాలువ ఒడ్డుకు షికారు వెళ్ళింది&period; అక్కడి ప్రదేశమంతా పచ్చటి గడ్డితో ఎంతో అందంగా ఉంది&period; ఆ లేత గడ్డిని చూసి గొర్రె ఎంతో హుషారుగా వాటిని మేయడం మొదలుపెట్టింది&period; సరిగ్గా అప్పుడే ఒక సింహం దాహం తీర్చుకోడానికి వచ్చి గొర్రెను చూసింది&period; &OpenCurlyQuote;ఇదేమి విచిత్రం&comma; సింహం జాతికి చెందిన జంతువు గడ్డిమేయడమా&quest; సింహం ఆకలితో చస్తుంది&period; కానీ గడ్డి మాత్రం మేయదు&period; బహుశా ఇది క్రూర జంతువు కాకపోవచ్చు’ అని ఆలోచించి ఒక్కసారిగా గర్జించింది&period; ఆ అరుపువిని గొర్రె భయపడిపోయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగుపెట్టింది&period; ఇంతలో గొర్రె కప్పుకుని ఉన్న సింహం తోలు దాని ఒంటి మీద నుండి జారిపోయింది&period; ఎదురుగా ప్రత్యక్షమైన గొర్రెను చూసి సింహం నోరు వెళ్ళబెట్టింది&period; గొర్రె ఎలాగోలా సింహానికి దొరక్కుండా అక్కడి నుండి పారిపోయింది&period; ఎదో విధంగా అడవిని దాటి తనకు కనబడి à°¨ ఊళ్లోకి వెళ్లిపోయింది&period; ఆ సంగతి తెలిసి జంతువులన్నీ నవ్వుకున్నాయి&period; ఇక ఆ తరువాత అడవిలో నిర్భయంగా సంచరించసాగాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts