Off Beat

అన్ని హోటల్స్ లో ఇలాంటి బోర్డ్ పెడితే… ?

ఈ ఫోటోలో హోటల్ వారు సాంబార్ పార్సెల్ లేదు అని బోర్డ్ పెట్టేసారు. టూరిస్టు సెంటర్ కాబట్టి సాధరణంగా ఎవరూ స్టైన్ లెస్ స్టీల్ క్యారియర్ లు/ టిఫెన్ డబ్బాలు తెచ్చుకోరు. ఇది కూడా ప్లాస్టిక్ నిషేధం కు ఒక మార్గమే. రాష్ట్రంలో అన్ని హోటల్స్ లో ఇలాంటి బోర్డ్ పెడితే, మంచిదే కదా ప్లాస్టిక్ కవర్ల ను బ్యాన్ చేసిన తరువాత హోటల్స్ లో , ఎక్కువగా ఇటువంటి సిల్వర్ ఫాయిల్ లాంటి పౌచ్ లలో వేడి సాంబార్ లాంటివి ప్యాక్ చేస్తున్నారు. నేను చూచిన ఒక కవర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ పౌచ్ లు పాలిస్టర్ ( polyster), పాలీఇథలీన్ ( poly ethelyne) ల మిశ్రమం తో తయారు చేయబడింది.

ఇందులో పాలిస్టర్ వేడికి తట్టుకోలేదు. ప్లాస్టిక్ లాగా వంపులు తిరిగి ( deformation) పోతుంది. పాలీ ఇథలీన్ (Polyethylene) కొంచెం వేడిని తట్టుకుంటుంది కానీ ఎక్కువ వేడిలో ఇందులోని కెమికల్స్ ఆహారంలోనికి సూక్ష్మంగా మైక్రాన్లలో చేరగలవట. ఇలా వేడిగా ఉన్న ఆహారంలో ప్లాస్టిక్ కవర్ల నుండి కెమికల్స్ చేరడం ను Leeching అని అంటారు. అందుకు సేఫ్టీ కొరకు ఎక్కువ మందం ఉన్న (Food grade polyethylene covers ) FSSAI వారు ఆమోదించిన పాలీఇథిలీన్ కవర్లను వాడవచ్చు. కానీ ఫుడ్ గ్రేడ్ పాలీఇథిలీన్ అని కంపెనీ వారు ఎక్కడా మెన్షన్ చేయలేదు. పైగా వేడిని తట్టుకోలేని పాలీస్టర్ ను కలిపారు. మనకు ఈ కవర్లులో వేడి పదార్థాలు ను వాడడానికి ఎంతవరకు సేఫ్ అనేది ఆ కంపెనీ కవర్ పై ప్రింట్ చేసిన స్పెసిఫికేషన్స్ చూస్తే కానీ తెలుసుకోలేము.

what happens if you use these covers for food

అదికూడా (High density polyethylene -HDPE) మందమైన హై డెన్సిటీ పాలీఇథలీన్ కవర్లయితేనే, అది వేడి పదార్థాలను తట్టుకోగలదు. అది కూడా వేడిగా ఉన్న ప్రాంతంలో UV light వలన ఈ కవర్లు కూడా విచ్ఛిన్నం అయి, ఆ కెమికల్స్ ఆహారం లోకి Leech అవుతాయట. కంపెనీ వారు కనీసం ఫుడ్ గ్రేడ్ పాలీఇథలాన్ కవర్ అని చెప్పట్లేదు. ఇలాంటి కవర్ల ను నమ్మి వేడి సాంబార్ లాంటివాటిని వేసి తీసుకెళ్లలేము. అందువలన ఇటువంటి అనుమానస్పద కవర్లను వాడే బదులు, స్టైన్ లెస్ స్టీల్ క్యారియర్లు/ టిఫెన్ డబ్బాలు వాడడం మేలు. వీలైనంతవరకు హోటల్ లోనే స్టీల్ ప్లేట్ల లో ఆహారం స్వీకరించండి. లేకపోతే మీ క్యారియర్ లు తెచ్చుకోవడం మేలు.

Admin

Recent Posts