information

ఒక్క నెల ఈఎంఐ క‌ట్ట‌క‌పోయినా సిబిల్‌ను త‌గ్గిస్తారు క‌దా.. ఇది క‌రెక్టే అంటారా..?

నా ఈ సమాధానం బ్యాంకుకి అప్పు సక్రమంగా కట్టని ఋణగ్రహీతలకి నచ్చదు. నన్ను తిట్టుకోవచ్చును కూడా… అయితే నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది…. బ్యాంకులో ఋణం తీసుకుంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా EMI కట్టాల్సిందే. ఒక్కరోజు లేటు అయినా ఛార్జీలు బాదేస్తారు. బ్యాంకులు ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు తీసుకుని, అదే ప్రజలలో అవసరమైన వారికి అప్పులు ఇస్తాయి. ఈ క్రమంలో కొంత లాభాలను అరుదుగా నష్టాలను మూటగట్టు కుంటాయి. మీరు బ్యాంకులో ఒక లక్ష రూపాయలు డిపాజిట్ వేశారు. దానిమీద నెలవడ్డీ తీసుకోవడానికి మీరు బ్యాంకుకు వెళితే, వారు మాకు రావలసిన అప్పులు వసూలు కాలేదండి, మేము ఇప్పుడు ఇవ్వలేము… మళ్లీ రండి అంటే మీకు ఎలా ఉంటుంది? కదా?

మీ అవసరానికి బ్యాంకు మిమ్మల్ని ఆదుకుని, మీకు లక్షలు అప్పు ఇచ్చింది. అది మీరు విస్మరించి బ్యాంకు ని నిందిస్తే ఎట్లా? ఇక్కడ మీరు బ్యాంకుల పారుబాకీల గురించి కొంత తెలుసుకోవాలి. నేను బ్యాంకులో చేరిన కొత్తల్లో అప్పుల మీద వడ్డీ వసూలు ఐనా కాకపోయినా, దాన్ని ఆదాయం కింద చూపించేవారు…(on accrual basis) అది సరి కాదు. 1990 వ దశకంలో ఈ పద్ధతి మారింది. బ్యాంకుల అంతర్జాతీయ బాంకు అకౌంటింగ్ ప్రమాణాలను అనుసరించి భారతదేశంలో కూడా బాసెల్ -III విధివిధానాలను అమలు చేశారు. దీని ప్రకారం వడ్డీ వసూలైతేనే ఆదాయం; మూడు నెలలు వరుసగా అప్పు కట్టకపోతే అది పారుబాకీ….. ఈ పద్ధతులు ఇదివరకు లేవు.

what happens if you do not pay emi

బ్యాంకుపై పారుబాకీల యొక్క ప్రభావం ఏమిటి? ముందుగా వసూలు కానీ వడ్డీ మొత్తాన్ని బ్యాంకు ఆదాయం నుంచి తొలగించాలి. బ్యాంకు అప్పులో ఎన్ని వాయిదాలు బకాయి లున్నాయి అనే దానిని బట్టి, బ్యాంకు తమ లాభాల నుంచి కొంత శాతాన్ని తీసి పక్కన పెట్టాలి. అంటే బాంకు ఆదాయం తగ్గుతుంది. బ్యాంకు అప్పు యొక్క స్థితి మరింత దిగజారురుతూ ఉంటే, (అంటే మరిన్ని బకాయిలు పెరిగిపోతే), బ్యాంకు తమ లాభాల లోనుంచి పక్కన పెట్టాల్సిన శాతం ఇంకా పెరుగుతూ పోతుంది. దీని వలన బ్యాంకు నష్టాలు పెరుగుతాయి. ఇలా ఒక ఖాతా కాదు, మొండి బకాయిలు చాలా ఖాతాలు ఉంటే, బ్యాంకు మరింత తీవ్రమైన నష్టాలకు, ఒడిదుడులకి లోనవుతుంది. మనం అందరం అనుకోవచ్చు- నేనొక్కడినే రెండు మూడు నెలలు బకాయిలు కట్టకపోయినంత మాత్రాన బ్యాంకుకి ఏం కాదులే అని. కానీ ఇలా దేశం మొత్తం మీద, అన్ని బ్రాంచీలలో జరిగినప్పుడు, ఆ బ్యాంకుకు జరిగే నష్టం అపారం.

మనం అప్పు తీసుకునే ముందు నా నెల ఆదాయం ఇంత, ఇంత మిగులుతుంది, ఇంత EMI కడతాను అని ఒప్పుకుంటున్నాం కదా. దాన్ని ఆషామాషీ/ Casual గా తీసుకోవడం మన తప్పు. సక్రమంగా కట్టేవారికి సిబిల్ బాగానే ఉంటుంది. ఇది ఋణగ్రహీతలలో ఆర్థిక క్రమశిక్షణ పెంచడానికి ప్రభుత్వం పెట్టిన నియమం. దీని వల్ల ఆర్థిక పరిస్థితి తారుమారు అవుతోంది కదా? అంటే.. అవును ఇబ్బంది అవుతుంది. కానీ తప్పదు. మనం ఒప్పుకున్నాం కద. ఐనా 90 రోజుల వరకు ఇబ్బంది లేదు.

Admin

Recent Posts