Off Beat

పోలీసుల ఎడమ భుజానికి ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?

సాధారణంగా మనం చూసినట్లయితే పోలీసులకి, ట్రాఫిక్ పోలీసులకి ఎడమ భుజానికి ఒక తాడు లాంటిది ఉంటుంది. ఎప్పుడైనా మీరు దానిని గమనించారా? ఎందుకు ఆ తాడు ఉందని అనుకున్నారా? కానీ అర్థం కాలేదా? అయితే ఇక్కడ క్లారిటీగా పోలీసులకి తాడు ఎందుకు ఉంటుంది అనేది వివరించడం జరిగింది. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.

పోలీసులకి, ట్రాఫిక్ పోలీసులకి ఎడమవైపు భుజానికి తాడు లాంటిది ఉంటుంది. ఎందుకు అసలు ఈ తాడు అనేది పెడతారు అంటే, ఈ తాడుకి ఒక విజిల్ లాంటిది చివర ఉంటుంది. ఈ విజిల్ ని అత్యవసర పరిస్థితుల్లో అది ఇండికేషన్ గా పనిచేస్తుంది. అదే ఒకవేళ ట్రాఫిక్ పోలీసులకు అయితే ఇది మరింత బాగా ఉపయోగపడుతుంది.

what is this thread worn by police

ట్రాఫిక్ పోలీసులకి కచ్చితంగా విజిల్ చాలా అవసరం. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి విజిల్ ఉపయోగపడుతుంది. అది పడిపోకుండా సపోర్టుగా ఆ తాడు ఉంటుంది. ఆ తాడు ఉండడం వలన విజిల్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువగా మనకి నల్లటి, ఎర్రటి మరియు కాకి రంగు తాడులు కనబడతాయి. ఈ విజిల్ ని తాడుకు అమర్చి దానిని జేబులో పెట్టడం జరుగుతుంది. ఇంగ్లీషులో దీనిని లాన్ యార్డ్ అంటారు. ఇది ఆ తాడు ఉండడానికి అసలు కారణం. నల్ల రంగు తాడు కానిస్టేబుల్ కి, ఎరుపు రంగు ఎస్సై, సీఐ లకి నీలం రంగు డిఎస్పి నుండి పై స్థాయి వారికి ఉంటుంది.

Admin

Recent Posts