lifestyle

పెళ్ళైనా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు ?అవి కూడా కారణమా?

పెళ్లంటే నూరేళ్ల పంట. కష్టం అయినా సుఖం అయినా చచ్చేంత వరకు భార్య భర్తతో, భర్త భార్యతో కలిసి ఉండాలి. ఇది కదా జీవితం అంటే.. కాని ఈ మధ్య పెళ్లిళ్లన్ని పెటాకులు అవుతున్నాయి. దీనికి కారణం ఒక్కటే వివాహేతర సంబంధాలు. దీనికి స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అని తేడా లేదు. తమ దాంపత్య జీవితంలో ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా.. వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా.. పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి.

పడక గదిలో భర్త లేదా భార్య ఇద్దరి మధ్య సుఖమైన శృంగారం లేకపోతే ఇద్దరు పక్క చూపులు చూస్తున్నారట. ఇంకా శృంగారంలో భర్త భార్య శరీర అందాలను అసహ్యించుకున్నట్టయితే ఆమె అతనితో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదట. పెళ్లెన కొత్తలో స్త్రీ బాగా రెడీ అయ్యి బెడ్ రూం కు వస్తుంది.. రోజులు గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపక పోవడం వల్ల కూడా అనేక మంది భర్తలకు పూర్తి నిరాశ కలిగిస్తోందట. పెళ్లికి ముందు తనకు కాబోయే భార్య, భర్తల గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.. అందుకు తగినట్టు ఉండకపోవడంతో.. తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక పరాయి వాళ్లతో సంబంధం పెట్టుకుని ఆ కోర్కెలను తీర్చుకుంటున్నారు.

these may be the reasons why extra marital affairs are increasing

ఇక మహిళా ఉద్యోగుల విషయానికోస్తే తమ కార్యాలయాల్లో పని చేసే సమయంలో కొందరు పక్కవారితో క్లోజ్ గా ఉంటారు. ఈ పరిచయం కూడా వివాహేతర సంబంధానికి కారణం అవుతుంది. తమ పురుష సహచరులు, బాస్‌ల దగ్గర తమకి ప్రత్యేక గుర్తింపు దక్కాలనే ప్రయత్నంలో అధిక సమయం గడపడం వివాహేతర సంబంధాలకు దారి తీస్తుంది. తన భర్త, భార్య చెప్పినట్టు నడుచుకోకపోవడం, ప్రేమగా మాట్లాడకపోవడం, దంపతుల మధ్య అండర్ స్టాండింగ్ అనేది లేకపోవడంతో పక్క చూపులు చూస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది.

Admin

Recent Posts