Off Beat

రైల్వే స్టేషన్ కి వచ్చినా… రైల్వే ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరు.?

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలల విస్తరించి ఉన్నాయి. భారతీయ రైలు మార్గాల పై ప్రభుత్వానికి ఏకచత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాల ద్వారా జర్నీ చేసేందుకు అందరూ ఇష్టపడతారు. అయితే, రైల్వే స్టేషన్ కి వచ్చిన రైళ్ల ఇంజిన్ ను ఎందుకు ఆపివేయరో మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డీజిల్ తో నడిచే ప్రతి ఇంజిన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంజిన్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఈ బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ చార్జ్ చేయకపోతే రైలు యొక్క లోకో మోటివ్ సిస్టం ఫెయిల్ అయిపోతుంది. మార్గంలో రెడ్ లైట్ వచ్చినప్పుడు లేదా ఏదైనా కారణం చేత రైలు యొక్క డీజిల్ ఇంజిన్ ఆపేస్తే ఇంజిన్ ను తిరిగి ప్రారంభించడానికి 20 నిమిషాలు పడుతుంది. ఇదే కాకుండా మళ్లీ రైలుని తిరిగి ప్రారంభించాలి అంటే ఇంకా ఎక్కువ డీజిల్ అవసరం పడుతుంది. అందుకే, ఇంజిన్ ను మాత్రం రన్ లోనే ఉంచుతారు.

why diesel engine trains cannot be stopped

ఒకవేళ ఇంజిన్ ను ఎక్కువసేపు ఆపి ఉంచితే, బ్రేక్ లైనులను తిరిగి క్రమబద్ధీకరించడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. రైళ్లు పెద్దవిగా మరియు భారీగా ఉండటంతో సమర్థవంతంగా ఆపడానికి బ్రేక్ లైను పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ విషయంలో లోకో పైలట్లు ఎప్పుడు రాజీపడరు. ఈ ఒత్తిడి వలన రైలుని తిరిగి ప్రారంభించాలంటే చాలా సమయమే పడుతుంది. మరియు ఎక్కువ డీజిల్ అవసరం అవుతుంది. అందుకే రైల్వే స్టేషన్లలో కానీ మరే ఇతర కారణాల వలన కానీ అంత తొందరగా రైలు ఇంజిన్ ను ఆపివేయరు. మరొక విషయం ఏమిటంటే, రైలు కదపకుండా కేవలం ఇంజిన్ ను మాత్రమే ఆన్ చేసి ఉంచితే డీజిల్ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అదే ఇంజిన్ ను ఆపివేసి తిరిగి ఆన్ చేయాలి అంటే చాలా ఎక్కువ అవసరం పడుతుంది.

Admin

Recent Posts