Off Beat

కుక్క‌లు త‌ర‌చూ ఎందుకు ఏడుస్తాయి..? దీని వ‌ల్ల ఇంట్లోని వారికి ఏదైనా కీడు జ‌రుగుతుందా..?

8 గంటల నిద్ర వాటికి అవసరం ఉండదు. తెల్లవారు ఝాము లోపలే వాటి నిద్ర పూర్తయిపోతుంది. లేచాక కాసేపు బుద్ధిగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఏడవటం మొదలెడతాయి. నిజానికి అది ఏడుపు కాదు. భావ వ్యక్తీకరణ. కారణాలు ఇలా ఉంటాయి. విపరీతంగా బోర్ కొట్టడం. ఆకలి వేయడం లేదా అత్యవసరం. మానసికంగా ఒంటరితనం, యాంక్సైటీ (ఆందోళన) ఎక్సయిట్మెంట్ (ఉత్సాహం). ఇంట్లో అందరూ పడుకుని ఉండి, మన నిద్ర మాత్రం పూర్తయి లేచినపుడు – బోర్ కొట్టడం అనేది మనకూ జరిగేదే. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం.

పిల్లలు అయితే అలా లేచాక ఏడుపు మొదలెడతారు. ఏడిస్తే అటెన్షన్ దక్కుతుంది అని తెలియడం వల్ల. కుక్కలు చేసేది కూడా ఇదే. ఆకలి లేదు అని పడుకున్నాక, ఏ అర్ధరాత్రో విపరీతమైన ఆకలితో మెలకువ రావడం కూడా సాధారణమే.

why dogs cry frequently what is the reason

ఇంతేగాక, కుక్కలకు ఘ్రాణ జ్ఞానేంద్రియాలు (olfactory senses) మనుషులకంటే 10,000 నుండి 100,000 రెట్లు బలంగా ఉంటాయి. తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు సంభవించటానికి ముందు గాలిలో వచ్చే మార్పులను అవి పసిగడతాయి. అతి తక్కువ పౌనఃపున్య రంబుల్స్ ని వినగలుగుతాయి. తెల్లవారుఝామున వాతావరణంలో మార్పు వాటికి తేలికగా అర్ధమవుతుంది. అదేదో వినాశనానికే అనే భావనకు గురవటమూ జరుగుతుంది. ఆ భయంతోనూ ఏడుస్తాయి. ఇక శాస్త్రాల ప్ర‌కారం చూసుకుంటే కుక్క‌ల ఏడుపు మంచిది కాదంటారు. అవి ఏడిస్తే ఇంట్లోని వారికి ఏదో ఒక కీడు జ‌రుగుతుంద‌ని చెబుతారు. క‌నుక కుక్క‌లు ఏడుస్తుంటే వాటిని అక్క‌డి నుంచి త‌రిమేయాల‌ని చెబుతుంటారు.

Admin

Recent Posts