Off Beat

లు లూ మాల్‌ అంతగా పాపులర్ అవ్వడానికి కారణం ఏంటి ?

ఈ మ‌ధ్య కాలంలో పాపుల‌ర్ అయిన మాల్స్‌లో లులు మాల్ కూడా ఒక‌టి. డిమార్ట్ ఎంత‌టి పేరు గాంచిందో ఈ మాల్ కూడా అంతే పేరుగాంచింది. ఇక్క‌డ వాహ‌నాన్ని పార్కింగ్ చేసేందుకే సుమారుగా 15 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. లులు మాల్ వ్యవస్థాపకుడు , దుబాయ్ లో స్థిరపడిన ఒక మలయాళీ వ్యాపారవేత్త.. అసలు ఆ భవనం, బయట ఏర్పాటు చేసిన హంగులు చూస్తేనే వావ్ అనిపిస్తుంది. ఒక్క హైదరాబాద్ మాల్ కోసం వారు పెట్టిన పెట్టుబడి రూ. 300 కోట్లు అంటే అర్ధం చేసుకోండి, వారి వ్యాపారం ఏ స్థాయిలో ఉంటుందో..

ఈ మాల్‌లో సూప‌ర్ మార్కెట్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. దాదాపుగా 3 ఫ్లోర్స్‌లో ఉంటుంది. ఇక్కడ దేశ విదేశాల నుంచి సేకరించిన ఆపిల్స్ దాదాపుగా 10 వరకూ వెరైటీలు ఉంటాయి. కివి, న్యూజిలాండ్,, అమెరికా అంటూ ఏవేవో రకాల ఆపిల్స్..మిరపకాయల్లో కూడా 10 రకాల వెరైటీస్.. విభిన్నమైన రకాల పళ్ళు, ఫలాలు , Dry Fruits చాలా అందుబాటు ధరల్లో బాగున్నాయి.. చేపలు, మాంసం, చిరుతిళ్ళు, బిర్యానీలు, కాఫీ హౌస్ లు..బ్రాండెడ్ వస్త్రదుకాణాలు ఇలా ఇక్కడ దొరకనిది అంటూ ఏమి లేదు..

why lulu mall is so popular

బహుశా ఈ లులు గ్రూప్ మాల్స్ అంతలా విజయవంతం కావడానికి , వారు అందించే అన్ని రకాల వెరైటీస్, సరసమైన ధరలు, పైగా అన్నీ ఒకే చోట అందించడం కారణం అని చెప్ప‌వ‌చ్చు.

అయితే ఇక్కడ సమూహ నిర్వహణ, క్యూల నిర్వహణ సరిగ్గా లేదు.. నచ్చిన సామాను కొనడం చాలా సులభం, కానీ బిల్లింగ్ వేయించడానికి చుక్కలు కనిపిస్తాయి.. డబ్బులు ఇచ్చి కొనేదానికి కూడా, ఎదో ఉచితాల పంపిణీ జరుగుతున్నట్లు ప్రజలు ఎగబడి పోవడం మాత్రం ఇక్కడ షాపింగ్ అనుభవాన్ని చాలా ఇబ్బంది చేసి పడేసింది.. పార్కింగ్ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ పెడితే బాగుంటుంది.

Admin

Recent Posts