Off Beat

ప్రపంచంలో ఎక్కడా కానీ లభించని ఎర్రచందనం కేవలం శేషాచలం అడవుల్లో ఎందుకు లభిస్తుంది?

ఆల్మగ్ ,రెడ్ సాండర్స్ రక్తచందనం, ఎర్ర చందనం అనే పేర్లతో పిలవబడే ఈ వృక్ష శాస్త్రీయ నామం టీరో కార్పస్ శాంటాలినస్ (Ptero carpus Santalinus ). ఎనిమిది మీటర్ల (ఇరవయ్యారు అడుగులు)వరకు పెరిగే మొక్క. దక్షిణ తూర్పు కనుమలలో ఈ మొక్క పెరగటానికి ఎక్కువ అనువైన వాతావరణం ఉంటుంది. మొత్తం దక్షిణ భారత దేశమంతటా ఇది కనిపించినా శేషాచలం అడవులు దీనికి బాగా ప్రసిద్ధి. దీని కలపని మందుల్లో, సంగీత వాయిద్య తయారీకి, న్యూక్లియర్ రియాక్టర్ లలో , కుర్చీల వంటి గృహోపకరణాల త‌యారీకి వాడతారు. చైనాలో క్వింగ్ కాలంలో దీన్ని జిటాన్ అనే వారట. IUCN(International Union for Conservation of Nature) వారు ఈ మొక్కని అంతరించే ప్రమాదం ఉన్నదిగా ప్రకటించారు . తర్వాత 2018 లో అపాయం అంచున ఉన్నవి (nearly threatened ) గా దీన్ని మార్చారు.

చరిత్రలో హ్యుయాన్ త్సాంగ్ కాలం (ఏడవ శతాబ్ది ) నుంచి ఈ ఎర్రచందనం అక్రమ రవాణా ఉందని చీఫ్ కన్సర్వేటర్ గా పనిచేసిన నాగేశ్వరరావు అబిప్రాయం. వీరి అభిప్రాయం ప్రకారం శేషాచలం అడవుల్లో ఉన్న మృత్తికలో నీటిశాతం, ఆమ్లత, వాయుప్రసరణ, ఇతర పోషకాల లభ్యత, ఇవి పెరగటంలో పెద్ద పాత్ర పోషిస్తాయిట. వీటినే ఎడాఫిక్ కండిషన్ (edaphic condition) అంటారు. ఇది ఇతర ప్రాంతాల్లో ఉన్న తేడా వల్ల ఇవి ఇంత ఎక్కువ పెరగలేవు అని వీరి మాట. ఎర్ర చందనం పెరగటానికి సరిపోయే నిష్పత్తిలో మట్టి, స్ఫటిక శిల (Quartz) ఉండాలి. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా సరిపోవాలి.

why quality red sandal wood grows in only south india

ఎర్ర చందనం ,ప్రపంచం లో సహజ సిద్దంగా పెరిగేది మన దేశంలో అదీ దక్షిణ భారత దేశం లోనే. ముఖ్యంగా చిత్తూరు, కడప, అలాగే తమిళ నాట క్రిష్ణగిరి, వెల్లూరు , తిరువన్నామలై ప్రాంతాలు . ఇక దీని ప్రాధాన్యత తెలిసి సాగు పద్ధతుల ద్వారా ఒరిస్సా, కేరళ, కర్ణాటక, నీలగిరి ప్రాంతాల్లో కూడా పెంచుతూ ఉన్నారు. ఇది కాక కొరియా, చైనా, అమెరికాలో కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్యే తెలంగాణలో కూడా ప్రభుత్వమే ఈ దిశ గా ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలొచ్చాయి . ఇక దీని ఎగుమతిపై ఉన్న కఠిన మైన ఆంక్షల వల్ల సొంతంగా పెంచుకునే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టుగా వార్తలు ఉన్నాయి.

Admin

Recent Posts