Chedu Potlakaya : మనలో చాలా మంది జుట్టు రాలడం, చిన్న వయసులోనే బట్టతల రావడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో బట్టతల సమస్య 50 సంవత్సరాలకు పై బడిన వాళ్లల్లో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుత కాలంలో బట్టతల సమస్యను మనం 25 నుండి 30 సంవత్సరాలు దాటిన చాలా మందిలో చూడవచ్చు. ఈ సమస్య మహిళలతో పోలిస్తే పురుషులలో ఎక్కువగా వస్తోంది. మనలో చాలా మంది కొన్ని వెంట్రుకలు ఊడిపోగానే మానసికంగా కృంగిపోతారు. ఇలా కృంగిపోవడం వల్ల మరిన్ని వెంట్రుకలు రాలిపోతాయి. కొందరేమో కొన్ని వెంట్రుకలు రాలిపోగానే మార్కెట్ లో దొరికే రకరకాల షాంపులను వాడుతూ ఉంటారు.
బట్టతల రాకుండా ఉండడానికి ఎవరు ఏది చెబితే అది చేసి వారి బట్టతలకు వారే కారకులు అవుతూ ఉంటారు. వెంట్రుకలు రాలిన చోట కొత్త వెంట్రుకలు రావడానికి ఏం చేయాలి.. బట్టతలకు ఆయుర్వేదంలో ఎటువంటి చిట్కాలు ఉన్నాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బట్టతలను పూర్తిగా నివారించడానికి మనకు చేదు పొట్లకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇది గ్రామాలలో ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంటుంది. చేను కంచెలకు, రేగు చెట్లకు, తుమ్మ చెట్లకు ఈ మొక్క పొదలాగా అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క కాయలు చూడడానికి పొట్లకాయలాగా ఉన్నప్పటికీ పొడవులో మాత్రం పొట్లకాయల్లా ఉండవు.
ఈ మొక్క కాయలు 4 లేదా 5 అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ఈ కాయలు చాలా చేదుగా కూడా ఉంటాయి. బట్టతలపై వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులను, ఒక కాయను తీసుకుని మెత్తగా నూరి దాని నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందు బట్టతలపై రాసి మర్దనా చేసి ఉదయం లేవగానే కడిగేయాలి. మళ్లీ రెండు లేదా మూడు రోజుల తరువాత ఈ విధంగా రసాన్ని తీసి బట్టతలపై రాయాలి. ఇలా ఐదు నుండి ఆరు సార్లు చేయడం వల్ల బట్టతలపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమవుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల బట్టతలపై వెంట్రుకలను మొలిపించవచ్చు. దీంతో ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.