Gaddi Gulabi Benefits : గడ్డి గులాబి మొక్క.. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్కను నాచు పూల మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎటువంటి నేలలోనైనా ఈ మొక్క సులభంగా పెరుగుతుంది. గడ్డి గులాబి పూలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. చాలా మంది ఇంటి పెరట్లో ఈ మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క నేలపై చాలా పొడవుగా పాకుతూ పెరుగుతుంది. అలాగే ఇది 20 సెంటిమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ గడ్డి గులాబి మొక్కలు చాలా సున్నితంగా, మృదువుగా ఉంటాయి.
సాధారణంగా చాలా మంది ఈ మొక్కను ఒక పూల మొక్కగానే చూస్తారు తప్ప దీనిని ఔషధ మొక్కగా ఎవరూ చూడరు. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. గడ్డి గులాబి మొక్కలో లాగే ఈ పూలలో మన చర్మం మరియు జుట్టు సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖం పై మొటిమలు, మచ్చలు, పిగ్మేంటేషన్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ మొక్కను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. గడ్డి గులాబి మొక్క ఆకులను, పువ్వులను పేస్ట్ గా చేసి అందులో ఒక ఈ స్పూన్ తేనెను కలిపి ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. గడ్డి గులాబి మొక్క ఆకుల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.
ఇది మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలతో బాధపడే వారు గడ్డి గులాబి మొక్క ఆకులను మెత్తగా పేస్ట్ గా చేయాలి. తరువాత దీనిలో కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెను కలిపి జుట్టుకు పట్టించాలి. ఒక గంట పాటు తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. అంతేకాకుండా గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి గాయలపై ఉంచడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. గాయాలు కూడా త్వరగా మానుతాయి. ఈ విధంగా గడ్డి గులాబి మొక్క మనకు ఉపయోగపడుతుందని దీనితో తయారు చేసిన ఫేస్ ఫ్యాక్ లను, హెయిర్ ఫ్యాక్ లను వాడడం వల్ల మనం చక్కటి సౌందర్యాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.