Jasmine Leaves : ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు త‌గ్గాలంటే.. మ‌ల్లె చెట్టు ఆకుల‌తో ఇలా చేయాలి..!

Jasmine Leaves : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే వాటిల్లో మ‌ల్లెపూలు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. అయితే మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మ‌న‌కు వ‌చ్చే చ‌ర్మ సంబంధ‌మైన స‌మ‌స్య అయిన మంగు మచ్చ‌ల‌ను నివారించుకోవ‌చ్చు. వీటినే న‌ల్ల మంగు మ‌చ్చ‌లు అని కూడా అంటారు. ఈ మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో మ‌ల్లె చెట్టు ఆకులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మంగు మ‌చ్చ‌లు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి.

ఎండ‌లో ఎక్కువ‌గా ప‌ని చేసే వారికి, ర‌సాయ‌నాల‌ను క‌లిగిన ఫేస్ వాష్ ల‌ను, క్రీముల‌ను వాడే వారికి ఈ మ‌చ్చ‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి. గ‌ర్భిణీ స్త్రీల‌లో హార్మోన్ ల అస‌మ‌తుల్య‌త‌ల కార‌ణంగా కూడా మంగు మ‌చ్చ‌లు వ‌స్తాయి. కానీ ప్ర‌సావానంత‌రం ఇవి వాటిక‌వే త‌గ్గుతాయి. మంగు మ‌చ్చలు ముఖం పైనే కాకుండా ఇత‌ర శ‌రీర భాగాల‌పై కూడా వ‌స్తాయి. ఇవి మ‌గ‌వారిలో కంటే ఆడ‌వారిలో ఎక్కువ‌గా వ‌స్తాయి. న‌ల్ల‌గా ఉన్న వారిలో కంటే తెల్ల‌గా ఉన్న వారిలోనే ఇవి ఎక్కువ‌గా వ‌స్తాయి. ఈ మ‌చ్చ‌ల వ‌ల్ల ఎలాంటి హాని క‌ల‌గ‌దు. ఎలాంటి నొప్పి కూడా ఉండ‌దు. కానీ ఇవి చూడ‌డానికి అంద‌విహీనంగా ఉంటాయి.

Jasmine Leaves can reduce all types of marks on face
Jasmine Leaves

వీటిని మ‌నం ఎటువంటి ఖ‌ర్చు లేకుండా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా మ‌ల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి నివారించుకోవ‌చ్చు. మ‌ల్లెచెట్టు ఆకుల‌ను, జాజికాయ‌ను క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్న మంగు మ‌చ్చ‌ల‌పై రాసి గంట నుండి రెండు గంట‌ల పాటు ఉంచిన త‌రువాత నీటితో క‌డిగేయాలి. అలాగే ఒక ఆలుగ‌డ్డ‌ను తీసుకుని పేస్ట్ గా చేసి దానిని మంగుమచ్చ‌లపై రాయ‌డం వ‌ల్ల కూడా మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా మల్లె చెట్టు ఆకుల‌ను ఉప‌యోగించి మంగు మ‌చ్చ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చని నిపుణులు తెలియ‌జేస్తున్నారు.

Share
D

Recent Posts