Kamanchi Plant : మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో కామంచి మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు విరివిరిగా కనిపించదు. కామంచి మొక్కకు ఎరుపు, నలుపు రంగుల్లో కాయలు గుత్తు గుత్తులుగా కాస్తాయి. ఈ మొక్క ఆకులు మిరప చెట్టు ఆకుల లాగా ఉంటాయి. కామంచి మొక్క ఆకులు, పండ్లు, కాండం అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలకు ఈ మొక్క ఆకుల రసాన్ని లేపనంగా వాడతారు. పైల్స్ ను తగ్గించడంలో కూడా ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల త్రిదోషాలు హరిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ మొక్క పండ్లను సేకరించి నీడలో ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని వస్త్రంలో వేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. రోజూ భోజనం తరువాత ఒక టీ స్పూన్ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఆయాసం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, పిల్లి కూతలతోపాటు ఇతర శ్వాస సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. సంతాన లేమితో బాధపడే స్త్రీలు రుతు స్నానం చేసిన తరువాత పుష్యమి నక్షత్రం రోజున కామంచి మొక్క సమూల రసాన్ని తాగడం వల్ల గర్భాశయం శుద్ధి అయి సంతాన లేమి సమస్యలు తగ్గి సంతానం కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ మొక్క ఆకులను కూరగా చేసుకుని తింటూ ఉండడం వల్ల రేచీకటి సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా కూరగా చేసుకుని తినడం వల్ల పురుషులల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. కామంచి మొక్క ఆకుల రసాన్ని చెవిలో వేయడం వల్ల చెవి పోటు తగ్గుతుంది. కామంచి మొక్క పండ్లను పొడిగా చేసి ఆ పొడితో కషాయాన్ని చేసుకోవాలి. ఈ కషాయానికి తేనెను కలిపి తాగడం వల్ల అతి మూత్రం, మధుమేహం వంటి వ్యాధులు తగ్గుతాయి. కామంచి లేత ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని లేపనంగా రాయడం వల్ల సోరియాసిస్ తోపాటు ఇతర చర్మ వ్యాధులు తగ్గు ముఖం పడతాయి.
ఈ మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కామంచి మొక్క ఆకుల రసాన్ని 10 నుండి 20 ఎంఎల్ మోతాదులో ప్రతి రోజూ ఉదయం సేవిస్తూ ఉండడం వల్ల సమస్యలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా కామంచి మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల గుండె సమస్యలతోపాటు చర్మ వ్యాధులు, స్త్రీ బహిష్టు సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.