మొక్క‌లు

Konda Pindi Aaku : మూత్రాశయ ఇన్ఫెక్ష‌న్‌, మూత్రంలో మంట‌, కిడ్నీల్లో రాళ్ల‌కు.. ఈ ఒక్క ఆకు చాలు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Konda Pindi Aaku : మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్ల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఇది పురుషుల్లో క‌న్నా స్త్రీల‌లోనే ఎక్కువ‌గా వ‌స్తుంది. అయితే ఈ స‌మ‌స్య స‌హ‌జంగా నీరు ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా వ‌స్తుంది. ఈ ఇన్‌ఫెక్ష‌న్ ఉంటే విప‌రీత‌మైన నొప్పి ఉంటుంది. మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పి, మంట అనిపిస్తాయి. మూత్రం రంగు మారుతుంది. మూత్రం చాలా త‌క్కువ‌గా వ‌స్తుంది. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే క‌చ్చితంగా అది మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ అని అనుమానించాలి.

ఇక ఈ సమస్యను తగ్గించడానికి కొండపిండి ఆకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మ‌న‌కు ఎక్క‌డ చూసినా ల‌భిస్తుంది. ర‌హ‌దారుల ప‌క్క‌న‌, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పెరుగుతాయి. దీన్ని సేక‌రించ‌డం కూడా పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఇక కొండ పిండి ఆకులో మూత్రాశ‌య‌ ఇన్ ఫెక్షన్ మీద పోరాటం చేసే లక్షణాలు సమృద్దిగా ఉంటాయి. కొండపిండి ఆకు మ‌న‌కు ఎక్క‌డైనా స‌రే విరివిగా లభ్యం అవుతుంది. ఈ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి డికాషన్ చేసుకొని తాగవచ్చు.

konda pindi aku useful in kidneys health

కొండపిండి ఆకు లేకపోతే కొండపిండి ఆకు పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఈ పొడిని నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఈ విధంగా తాగడం వల్ల మూత్రాశ‌య ఇన్ ఫెక్షన్ తగ్గడ‌మే కాకుండా కిడ్నీలో రాళ్ళ సమస్య, మూత్రంలో మంట, శరీరంలో వేడి.. ఇలా అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. క‌నుక ఈ ఆకు ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకుని ఉప‌యోగించండి. దీంతో మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Admin

Recent Posts