Drinking Water : మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడం ఎంత అవసరమో.. రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం కూడా అంతే అవసరం. అలాగే రోజూ తగినంత మోతాదులో నిద్ర కూడా పోవాల్సి ఉంటుంది. దీంతోపాటు రోజూ తగినన్ని నీళ్లను కూడా తాగాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే నీళ్లను తాగే విషయంలో చాలా మంది అనేక పొరపాట్లు చేస్తుంటారు. అవి చేయకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక నీళ్లను తాగే విషయంలో తప్పక జాగ్రత్తలను పాటించాలి. ఇక చాలా మంది నీళ్లను తాగే విషయంలో చేసే పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది నీళ్లను రోజూ అవసరం అయిన దాని కన్నా ఎక్కువగా తాగుతుంటారు. రోజూ తమ శరీరానికి అవసరం అయిన దాని కన్నా ఎక్కువగా నీళ్లను తాగుతారు. ఇలా చేయరాదు. మనకు దాహం అనిపిస్తే నీళ్లను తాగాలి. లేదా రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లను తాగాలి. అంతేకానీ.. అవసరం లేకున్నా ఎక్కువగా నీళ్లను తాగరాదు. తాగితే కిడ్నీలపై భారం పడుతుంది. ఇవి నీళ్లను బయటకు పంపిస్తూనే ఉంటాయి. కనుక రోజూ అవసరం అయిన మేర మాత్రమే నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇక టీ, కాఫీలను తాగేముందు నీళ్లను తప్పక తాగాలి. ఎందుకంటే టీ, కాఫీలను తాగిన తరువాత శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. నీళ్లను కోల్పోతుంది. కనుక ఆ నీటిని భర్తీ చేసేందుకు గాను టీ, కాఫీలను తాగేందుకు ముందే నీళ్లను తాగాలి. దీంతో నీళ్లను కోల్పోకుండా జాగ్రత్త పడవచ్చు.
ఇక నీళ్లను కొందరు వేగంగా తాగుతారు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. కనుక నీటిని నెమ్మదిగా తాగాల్సి ఉంటుంది. అలాగే చాలా మంది భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగుతుంటారు. ఇలా చేయరాదు. భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగితే జీర్ణరసాలు సరిగ్గా ఉత్పత్తి కావు. దీంతో జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. కనుక భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగరాదు. భోజనానికి 30 నిమిషాల ముందు నీళ్లను తాగవచ్చు. లేదా భోజనం చేశాక కనీసం 30 నిమిషాలు ఆగి ఆ తరువాతే నీళ్లను తాగాలి. దీంతో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇక చాలా మంది అనవసరంగా చల్లని నీళ్లను తాగుతుంటారు. దీని వల్ల కూడా జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అజీర్ణం వస్తుంది. కనుక చల్లని నీళ్లను తాగరాదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లను లేదా గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దీంతో జీర్ణం సరిగ్గా అవుతుంది. గ్యాస్ ఏర్పడదు. ఇక చాలా మంది నల్లా ద్వారా వచ్చే నీళ్లను నేరుగా అలాగే తాగుతుంటారు. అలాగే మినరల్ వాటర్ క్యాన్లలోని నీళ్లను కూడా అలాగే తాగుతుంటారు. కానీ వాటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలి. లేదంటే వాటిల్లో ఉండే బాక్టీరియా, వైరస్‌లు మనకు అనేక రకాల ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. కనుక నీళ్లను ఎప్పుడైనా సరే బాగా మరిగించి చల్లార్చి తాగాలి. అప్పుడే మనం అనారోగ్యాల బారిన పడకుండా.. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం.