Kuppintaku : కుప్పింట మొక్క ఎంత గొప్ప‌దంటే.. మొండి వ్యాధులు సైతం న‌యం అవుతాయి..!

Kuppintaku : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల స‌హ‌జంగానే కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువుతో కూడా చాలా మంది కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నాలు అంటూ లేవు. ర‌క‌ర‌కాల మందుల‌ను, నూనెల‌ను, ఆయింట్ మెంట్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటి కోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం అంత ఎక్కువ‌గా ఉండ‌దు. వీటిని వాడ‌డం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు కూడా అధికంగా ఉంటాయి.

Kuppintaku is very wonderful plant know its benefits
Kuppintaku

అయితే స‌హ‌జ సిద్ధంగా ప్ర‌కృతి ప్ర‌సాదించిన కుప్పింట‌ మొక్క‌ను ఉప‌యోగించి మ‌నం కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయ‌డం వ‌ల్ల నొప్పులు త‌గ్గుతాయి. అంతే కాకుండా ఈ మొక్క వేరుతో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల దంతాలు తెల్ల‌గా మారుతాయి. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే నొప్పి త‌గ్గుతుంది. చిగుళ్లు గ‌ట్టి ప‌డి చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం త‌గ్గుతుంది.

ఆయుర్వేద నిపుణులు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కుప్పింట‌ మొక్క‌ను ఉప‌యోగిస్తున్నారు. ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా చేసి అందులో కొద్దిగా ప‌సుపును క‌లిపి ముఖానికి రాసి 15 నిమిషాల త‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డిగేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు కూడా తొల‌గిపోతాయి.

పురాత‌న కాలం నుండి ఆయుర్వేదంలో కుప్పింటాకును ఉప‌యోగిస్తున్నారు. దీనిని పిప్పింటాకు, హరిత మంజిరి, నురి పిండి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క‌ ఆకుల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే ఆ నీటిని తాగ‌డం వ‌ల్ల శ్వాస కోస స‌మస్య‌లు త‌గ్గుతాయి. కుప్పింటాకు చెట్టు ఆకుల నుండి ర‌సాన్ని తీసుకుని అందులో నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి చ‌ర్మానికి రాసుకోవ‌డం వ‌ల్ల గ‌జ్జి, తామ‌ర వంటి వాటితో పాటు దుర‌ద‌లు, ద‌దుర్లు త‌గ్గుతాయి.

పురుగులు, తేలు వంటి వంటివి కుట్టిన‌ప్పుడు ఈ చెట్టు ఆకుల ర‌సాన్ని ఆ భాగంలో రాయ‌డం వల్ల అవి ప్రాణాంత‌కంగా మార‌కుండా ఉంటాయి. గోరు చుట్టును త‌గ్గించ‌డంలోనూ కుప్పింటాకు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఈ ఆకుల ర‌సంలో, ప‌సుపు క‌లిపి గోరు చూట్టూ రాసి క‌ట్టుక‌ట్ట‌డం వ‌ల్ల గోరు చుట్టు స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ ఆకుల ర‌సంలో వెన్న క‌లిపి తీసుకోవ‌డం వల్ల మూర్ఛ వ్యాధి త‌గ్గుతుంది. కీళ్ల నొప్పుల‌తోపాటు త‌ల నొప్పిని త‌గ్గించ‌డంలోనూ కుప్పింటాకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ చెట్టు ఆకుల ర‌సాన్ని నుదుటిపై రాసుకోవ‌డం వ‌ల్ల త‌లనొప్పి త‌గ్గుతుంది. త‌ల‌నొప్పి తీవ్రంగా ఉన్న‌ప్పుడు ఈ చెట్టు ఆకుల ర‌సాన్ని రెండు చుక్క‌ల చొప్పున ముక్కు రంధ్రాల‌లో వేసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి త‌గ్గుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts