Mulla Gorinta Plant : ఈ మొక్క మ‌న చుట్టూనే ఉంటుంది.. ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసినా న‌యం కాని రోగాల‌ను త‌గ్గిస్తుంది..!

Mulla Gorinta Plant : ముళ్ల గోరింట‌.. మ‌న ఇంటి పెర‌ట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. వివిధ రంగుల్లో ఆక‌ర్ష‌నీయ‌మైన పూల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క పూల‌ను మాల లాగా క‌ట్టుకుని జ‌డ‌లో ధ‌రిస్తూ ఉంటారు. ఈ మొక్క పూలు ఎరుపు, తెలుపు, ప‌సుపు, నీలం రంగులో ఉంటాయి. ఈ ముళ్ల గోరింట మొక్క ఎల్ల‌ప్పుడూ ప‌చ్చ‌గా ఉంటుంది. చిన్న చిన్న ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొక్క గుబురుగా 2 నుండి 4 అడుగుల ఎత్తులో పెరుగుతుంది. కేవ‌లం అలంక‌ర‌ణ కోసం మాత్ర‌మే కాకుండా మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో కూడా ముళ్ల గోరింట మొక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక వ్యాధుల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి పాదాల‌కు రాసుకోవ‌డం వ‌ల్ల పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి. అలాగే ఈ మొక్క‌ను సంస్కృతంలో వ‌జ్ర‌దంతి అని అంటారు. ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల దంతాలు వ‌జ్రంలాగా మెరిసిపోతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి అందులో ఉప్పు క‌లుపుకుని దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల దంతాల‌పై ఉండే పాచి, గార‌, ప‌సుపుద‌నం తొల‌గిపోతుంది. ఈ మొక్క ఆకుల పేస్ట్ లో తేనె క‌లిపి వాడ‌డం వ‌ల్ల దంతాల నుండి ర‌క్తం కారడం త‌గ్గుతుంది. ఈ మొక్క‌ల‌తో డికాష‌న్ ను త‌యారు చేసుకుని నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల నోటిపూత‌, నోటి దుర్వాస‌న వంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి.

Mulla Gorinta Plant benefits in telugu
Mulla Gorinta Plant

అలాగే ఈ ఆకుల పేస్ట్ ను తామ‌ర‌, దుర‌ద వంటి చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న చోట లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌లు తగ్గు ముఖం ప‌డ‌తాయి. అలాగే ఈ మొక్క బెరడును నీటిలో వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తాగ‌డం వల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. శ‌రీరంలో అధికంగా ఉండే కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. అలాగే ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా చేసి నొప్పులు ఉన్న చోట లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల నొప్పులు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. అలాగే ముళ్ల గోరింట మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది.

ఈ మొక్క స‌మూల చూర్ణాన్ని 6 గ్రాముల మోతాదులో నీటిలో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేసదే అయిన‌ప్ప‌టికి ఈ మొక్క ఆకుల చూర్ణాన్న 5 నుండి 20 ఎమ్ ఎల్ మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. అలాగే ఈ ఆకుల డికాష‌న్ ను కూడా 100 ఎమ్ ఎల్ లోపు మాత్ర‌మే తీసుకోవాలి. ఈ విధంగా ముళ్ల గోరింట మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను చాలా సుల‌భంగా దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts