Nalleru Chettu : దీన్ని వాడితే చాలు.. విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి..!

Nalleru Chettu : న‌ల్లేరు మొక్క‌.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క శాస్త్రీయ నామం సిస్స‌స్ క్వ‌డ్రాన్గ‌ల‌రీస్. దీనిని అస్థిసంహార‌క అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కువ‌గా గ్రామాల్లో క‌నిపిస్తూ ఉంటుంది. పెద్ద వృక్షాల‌కు అల్లుకుని ఈ మొక్క ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. ఆషాడ మాసంలో ఈ మొక్క‌తో ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఈ మొక్క చూడ‌డానికి ఎడారి మొక్క‌లాగా ఉంటుంది. కొంత‌మంది దీనిని అలంక‌ర‌ణ మొక్క‌గా కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ మొక్క‌ను చాలా సుల‌భంగా ఇంట్లోనే పెంచుకోవ‌చ్చు. ఈ మొక్క పెర‌గ‌డానికి ఎక్కువ‌గా నీరు కూడా అవ‌స‌రం ఉండ‌దు. న‌ల్లేరు మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి.

ఈ మొక్క‌ను ప‌చ్చ‌డిగా కూడా చేసుకుని తింటూ ఉంటారు. ఈ మొక్క అంచుల‌ను తీసేసి మ‌ధ్య‌లో ఉండే గుజ్జుతో ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. అలాగే దీనిని పేస్ట్ గా చేసి పిండిలో క‌లిపి రోటి, చ‌పాతీ వంటి వాటిని కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే దీనిని వండుకునేట‌ప్పుడు పెరుగులో లేదా మ‌జ్జిగ‌లో నాన‌బెట్టాలి. లేదంటే కొంద‌రిలో దుర‌ద‌లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉంటాయి. న‌ల్లేరు మొక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. విరిగిన ఎముక‌లను అతికించే శ‌క్తి కూడా న‌ల్లేరు మొక్క‌కు ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా, బ‌లంగా త‌యారవుతాయి. దెబ్బ‌తిన్న‌ ఎముక‌లు కూడా ఆరోగ్యంగా త‌యార‌వుతాయి.

Nalleru Chettu can heal bones
Nalleru Chettu

కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ మొక్క‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోనాలు కూడా పొంద‌వ‌చ్చు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. హెమ‌రాయిడ్స్, ఆస్థ‌మా, మ‌ధుమేహం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. ఈ విధంగా న‌ల్లేరు మొక్క మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అయితే దీనిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం త‌గిన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts