Tulsi Leaves : మనం అత్యంత పవిత్రంగ భావించే మొక్కల్లో తులసి ఒకటి. ఈ మొక్కను దేవతగా భావించి మనం నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికి తెలుసు. ఆయుర్వేదంలో అనేక వ్యాధులను నయం చేయడంలో తులసిని ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. మన ఆరోగ్యాన్ని కాపాడడంతో అందాన్ని కాపాడడంలో తులసి మొక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వివిధ రకాల సౌందర్య సాధనాలలో కూడా తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. తులసి మొక్క ఆకులను వాడడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. నోటిపూతను తగ్గించడంలో తులసి ఆకులు చక్కగా పని చేస్తాయి.
తులసి ఆకులను శుభ్రపరిచి నేరుగా నోట్లో వేసుకుని నమిలి తినడం వల్ల నోటిపూతతో పాటు ఇతర ఇన్ ఫెక్షన్ లు కూడా తగ్గుతాయి. తులసి ఆకులతో చేసిన డికాషన్ ను తీసుకోవడం వల్ల తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. కోజూ ఒక తులసి ఆకును తినడం వల్ల నాడులు ఉత్తేజంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాంతులు ఇబ్బంది పెడుతున్నప్పుడు తులసి ఆకులను, మిరియాలను, ధనియాలను కలిపి నూరి తింటే వాంతులు తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల దగ్గు కూడా తగ్గుతుంది. కడుపులోని నులి పురుగులు కూడా నశిస్తాయి. తలుసి ఆకులకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కూడా ఉంది.
షుగర్ వ్యాధి గ్రస్తులు తులసి ఆకులను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. తులసి ఆకుల రసంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల పైత్యం తగ్గుతుంది. తులసి ఆకులతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. తులసి ఆకులను పేస్ట్ గా చేసి ముఖానికి ప్యాక్ ల వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోయి మఖం అందంగా మారుతుంది. అలాగే జుట్టు పెరుగుదలలో కూడా తులసి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా వచ్చే జుట్టు సమస్యలను తులసి ఆకులు అరకడతాయి. తులసి ఆకులను ఎలా వాడడం వల్ల జుట్టు పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తులసి ఆకులను సేకరించి ఎండబెట్టాలి. తరువాత వాటిని పొడిగా చేయాలి.
ఈ పొడిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడిని కలపాలి. తరువాత దీనిలో నీటిని పోసి పేస్ట్ లా చేయాలి. అలాగే దీనిలో కొద్దిగా మెంతుల పొడిని కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజూ దీనిలో కొద్దిగా బాదం నూనెను కానీ గోరు వెచ్చని కొబ్బర నూనెను కానీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను కుదుళ్లకు బాగా పట్టించాలి. తలకు ఎంత బాగా పట్టిస్తే అంతటి చక్కటి ఫలితాను పొందవచ్చు. తరువాత దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తలకు పట్టించిన పేస్ట్ ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా నెలకు ఒకసారి చేసినా సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు కాంతివంతంగా తయారవడమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఈ విధంగా తులసి ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.