Uttareni : ఉత్త‌రేణి మొక్క‌తో ఎన్నో ఉప‌యోగాలు.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు..!

Uttareni : ప్ర‌కృతి మ‌న‌కు అనేక ర‌కాల వ‌న‌మూలిక‌ల‌ను ప్ర‌సాదించింది. కానీ వాటిపై స‌రైన అవ‌గాహన లేక పోవ‌డం వ‌ల్ల వాటిని మ‌నం ఉప‌యోగించుకోలేక పోతున్నాము. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన మెక్క‌ల‌లో ఉత్త‌రేణి మొక్క ఒక‌టి. ఉత్త‌రేణి మొక్క‌లో ప్ర‌తి భాగం కూడా మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఉత్త‌రేణి మొక్క ఆకులు, కాండం, వేర్ల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఉత్త‌రేణి మొక్క‌ను వాడ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌వచ్చు, ఈ మొక్క‌ను ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Uttareni plant amazing health benefits
Uttareni

1. ఉత్త‌రేణి మొక్క వేరుతో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ర‌కాల దంత స‌మస్య‌లు త‌గ్గుతాయి. పిప్పి ప‌న్ను వ‌ల్ల క‌లిగే నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కార‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అంతే కాకుండా దంతాలపై ఉండే గార తొల‌గిపోయి దంతాలు తెల్ల‌గా మారుతాయి.

2. ఉత్త‌రేణి మొక్క వేరును ఎండ‌బెట్టి పొడిలా చేసి ఆ పొడి ని పౌడ‌ర్ లా ముఖానికి వేసుకోవ‌డం వ‌ల్ల మొటిమలు, మ‌చ్చ‌లు, ముఖంపై ఉండే గుంత‌లు త‌గ్గుతాయి.

3. చ‌ర్మం పై ద‌దుర్లు, దుర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు ఉత్త‌రేణి ఆకుల ప‌స‌రును తీసి రాసుకోవ‌డం వ‌ల్ల దుర‌ద‌లు, ద‌దుర్ల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు ఉత్త‌రేణి ముక్క‌ను వేరుతో స‌హా తీసుకుని దానిని చిన్న ముక్క‌లుగా చేసి లీట‌ర్ నీటిలో వేసి మ‌రింగించాలి. ఇలా మ‌రిగించిన నీటిని వారానికి రెండు సార్లు తాగ‌డం వ‌ల్ల ఊబ‌కాయం స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. నెల‌స‌రి స‌మ‌యంలో చాలా మంది మ‌హిళ‌లు క‌డుపు నొప్పితో బాధ ప‌డుతూ ఉంటారు. అలాంటి స‌మ‌యంలో ఒక టీ స్పూన్ ఉత్త‌రేణి ఆకుల ర‌సాన్ని, ఒక క‌ప్పు ఆవు పాల‌లో వేసి క‌లిపి తాగ‌డం వ‌ల్ల క‌డుపు నొప్పి త‌గ్గుతుంది. అంతే కాకుండా స్త్రీల‌ల్లో వచ్చే వైట్ డిశ్చార్జ్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

6. తేలు కాటుకు గుర‌యిన‌ప్పుడు ఉత్త‌రేణి ఆకుల‌ను న‌మ‌ల‌డం, ఆకుల ర‌సాన్ని తేలు కాటుకు గురి అయిన భాగంలో రాయ‌డం వ‌ల్ల తేలు కాటు విష‌పూరితం కాకుండా ఉంటుంది.

7. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది మ‌హిళ‌లు సంతాన లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు . అలాంటి వారు నెల‌స‌రి స‌మ‌యంలో ఒక టీ స్పూన్ ఉత్త‌రేణి ఆకుల ర‌సాన్ని క‌ప్పు పాల‌ల్లో వేసుకుని మూడు రోజుల‌ పాటు తాగాలి. ఈ విధంగా రెండు నుండి మూడు నెల‌ల పాటు చేయ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు తొల‌గిపోయి, సంతానం క‌లిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts