Tulsi Plant : కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే వీళ్లు ఎప్పుడూ వెళ్లిపోతారా అనిపిస్తుంది. కొందరికి చక్కని స్వరం ఉంటుంది. కనుక వాళ్లు మాట్లాడిన కొద్ది వినాలనిపిస్తుంది. కొందరు మాట్లాడితే అర్థం కాక వారిపై విసుగు వస్తుంది. అలా మాట అందంగా రావడానికి ప్రధాన కారణం స్వరపేటిక. దీని నుండి చక్కని స్వరం వస్తుంది. అందుకే వారి మాటలు తియ్యగా తేనె పలుకుల్లా ఉండి మళ్లీ వినాలనిపిస్తుంది. జలుబు చేసినప్పుడు, స్వర పేటిక దెబ్బతిన్నప్పుడు, శీతల పానీయాలను ఎక్కువగా సేవించినప్పుడు మనకు గొంతులో ఇన్ ఫెక్షన్ వచ్చి గొంతు నొప్పి కలుగుతుంది. కొన్ని సార్లు ఈ గొంతునొప్పి మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.
ఇలా ఇబ్బంది పెట్టే గొంతునొప్పిని మన ఇంట్లో ఉండే తులసి ఆకులను ఉపయోగించి నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో అలాగే ఔషధ పరంగా తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసిలో కూడా కృష్ణ తులసి, రామ తులసి అని రెండు రకాలు ఉంటాయి. చాలా మంది కృష్ణ తులసిని ఎక్కువగా పూజిస్తారు. ఔషధాలలోనూ కృష్ణ తులసినే ఎక్కువగా ఉపయోగిస్తారు. పరమ పవిత్రంగా పూజించే తులసి మొక్క దాదాపు హిందువుల అందరి ఇండ్లల్లో ఉంటుంది. దేవతార్చనలో కూడా తులసి ఆకులను ఉపయోగిస్తారు. అలాగే ఔషధంగా కూడా తుసి మొక్క చక్కగా పని చేస్తుంది.
మనకు వచ్చే వివిధ రకాల ఇన్ ఫెక్షన్ లలో గొంతు ఇన్ ఫెక్షన్ కూడా ఒకటి. ఇన్ ఫెక్షన్ ల నుండి బయటపడడానికి చాలా మంది యాంటీ బయాటిక్ లను వాడుతూ ఉంటారు. మందులను వాడడానికి బదులుగా తులసి ఆకులను ఉపయోగించి మనం ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. గొంతు ఇన్ పెక్షన్ తో బాధపడే వారు ప్రతిరోజూ నీళ్లల్లో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేసినట్టయితే గొంతు ఇన్ ఫెక్షన్ నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. తులసి ఆకులకు జీలకర్రను కలిపి నమిలితే కడుపు నొప్పి తగ్గుతుంది. దగ్గుతో బాధపడే వారు తులసి ఆకుల పొడిలో జీలకర్ర పొడి, అల్లం పొడి కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. గ్లాస్ తులసి నీళ్లల్లో పావు టీ స్పూన్ యాలకుల పొడిని కలిపి ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మూత్ర సంబంధిత ఇన్ ఫెక్షన్ ల నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా తులసి ఆకులు మనకు ఎంతో సహాయపడతాయని వీటిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వాస్తు పరంగా కూడా తులసి మొక్కతో మనకు అనేక లాభాలు ఉంటాయి. తులసి మొక్కను ఇంటి పెరట్లో పెంచడం వల్ల లేదా ఇంటి ఎదురుగా ఖాళీ స్థలంలో పెంచడం వల్ల వాస్తు పరంగా అంతా మేలు జరుగుతుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇంట్లోని వారందరికీ ఆరోగ్యం కలుగుతుంది. అదృష్టం సిద్ధిస్తుంది. ఏం పని చేసినా కలసి వస్తుంది. అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. కనుక ఇంటి ఆవరణలో కచ్చితంగా తులసి మొక్కను పెంచాలి. దీంతో ఆరోగ్యం, వాస్తు పరంగా మనం లాభాలను పొందవచ్చు.