ఇతని పేరు.. ఇడీ అమీన్.. ఉగాండా అధ్యక్షుడు. పేరుకు మనిషే. కానీ ఇతను నరరూప రాక్షసుడు. 1971 నుండి 1979 వరకు ఉగాండా కు అధ్యక్షుడుగా పని చేశాడు. సైనిక పరిపాలకుడ గా ఉండేవాడు. ఇతడు తన ఇంటిలో అందమయిన ఆడవాళ్ళను భార్యలుగా పెట్టుకుని వారి అవయవాలను కోసి వండించుకుని తినేవాడు. ఈ ఒక్క విషయం చెబితే చాలు, ఇతను ఎంతటి రాక్షసుడో ఇట్టే అర్థమవుతుంది. ఇతని గురించి ఈ ఒక్క విషయం చెబితే చాలు.. అందరికీ ఒళ్లు జలదరిస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఎదురు రాని ఆడ వాళ్ళని హింసించి వారిని చంపి వారి అవయవాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వండించి తినేవాడు.
అతడి దుశ్చర్యలకు భయపడి వారు బలవంతంగానైనా సరే నవ్వేవారు. కానీ వాళ్ళను నవ్వుతూ ఎదురు రమ్మనేవాడు. అలా నవ్వుతూ కనబడక పోతే మిగిలిన ఆడవాళ్ళ ఎదురుగానే వాళ్ళ అవయవాలను కోయించేవాడు. ఇక పరిపాలన విషయానికొస్తే.. ఉగాండాలో వున్న భారతీయ సంతతిని ఏవో కారణాలను ఆపాదించి జైళ్లలో పెట్టి హింసించి చంపించాడు.
ఇడీ అమీన్ తన పదవీ కాలంలో చేస్తున్న అకృత్యాలను తట్టుకోలేని ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇతను తనకు ఎదురు తిరిగిన ఎంతో మంది మేథావులు, డాక్టర్లు, ఇంజినీర్లు వంటి వాళ్లను అతి కిరాతకంగా చంపించేవాడు. ఇతని కాలంలో జరిగిన హింస వల్ల సుమారుగా 5 లక్షల మంది వరకు చనిపోయారని సమాచారం. అయితే ఇంతటి నీచుడికి మాత్రం తగిన శిక్ష పడలేదు. ఎందుకంటే అధ్యక్ష పదవి అనంతరం ప్రాణ భయంతో సౌదీ అరేబియా పారి పోయాడు. అక్కడే తన జీవితం కొనసాగించాడు. తరువాత 2003 లో అనారోగ్యంతో మరణించాడు.